కృష్ణ

బందరు కాలువకు గండి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూన్ 6: తోట్లవల్లూరు వద్ద బందరు కాలువ కట్టపై మంగళవారం మట్టి తవ్వకాలకు తెరలేపారు. ట్రాక్టర్లతో మట్టిరవాణాకోసం నిబంధనలకు విరుద్ధంగా ఏనుగులకోడు డ్రైనేజీ మట్టితో అడ్డుకట్ట పోసి (పూడ్చి) పటిష్ఠమైన బందరు కాలువ కట్ట నుంచి మట్టి తవ్వకాలు ప్రారంభించారు. దీంతో బందరు కాలువ కట్టకు గండిపడే అవకాశం ఉండడంతో ఈ వ్యవహారం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. తోట్లవల్లూరుకు చెందిన చాగంటిపాటి ఉమాశేఖర్ పేరుతో గుడివాడ డివిజన్ డ్రైనేజీ ఎఇ వి చంద్రశేఖరనాయుడు ఏనుగులకోడుడ్రైన్‌లో మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. తోట్లవల్లూరు జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, కనకదుర్గమ్మకాలనీ, శ్మశానవాటికలను మెరక చేయటానికి ఉమాశేఖర్ అర్జీ చేయటంతో మట్టి తవ్వకాలకు అనుమతి ఇస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌లో ఏనుగులకోడు డ్రైన్‌లో 1300 మీటర్ల పొడవున 5.5 మీటర్ల వెడల్పున 0.7 మీటర్ల లోతున 5వేల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు. కాలువ కట్టకు ఎలాంటి నష్టం చేయకూడదని నిబంధన విధించారు. ఆర్డర్‌లో ఇంత స్పష్టంగా ఉండగా ఏనుగులకోడుడ్రైన్, బందరు కాలువల మధ్య కట్టపై మట్టి తవ్వకాలు చేపట్టారు. మెయిన్ రోడ్డు పక్కనే మట్టితవ్వకాలు మొదలు పెట్టటంతో కొందరు రైతులు మీడియాకు సమాచారమిచ్చారు. ఏనుగులకోడ్ డ్రైన్, బందరు కాలువల మధ్య కట్టపై మట్టితవ్వకాలు ఎలా చేస్తారని, కట్ట బలహీనపడితే రేపు ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. చినఓగిరాలకు 250 ట్రక్కుల మట్టి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చెబుతున్నారు. పేరుకు జెడ్పీ హైస్కూల్, కనకదుర్గమ్మకాలనీ, పీహెచ్‌సీలను మెరక చేయటానికని అనుమతి తీసుకుని కొందరు మట్టి అమ్మకాలకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కట్టపై మట్టి ఎక్కువగా ఉండబట్టే అనుమతి: డ్రైనేజీ ఏఈ
ఈ విషయంపై డ్రైనేజీ ఏఈ ఉదయ్‌కుమార్‌ని వివరణ కోరగా కాలువ కట్టపై ఎక్కువగా మట్టి ఉండటంతో తవ్వకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఆర్డర్‌లో ఏనుగులకోడు డ్రైనేజీలో మట్టి తవ్వాలని ఉండగా కట్టపై ఎలా తవ్వుతున్నారని అడగ్గా డ్రైనేజీ అంటే కట్టేనని అన్నారు. రైతులందరూ కలసి అర్జీ పెట్టినందువల్లే మట్టి తవ్వకానికి అనుమతి ఇచ్చామన్నారు. మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేయించామని, అభ్యంతరం ఉన్న రైతులతో మాట్లాడతామని అన్నారు. బందరు కాలువ కట్ట పూర్తిగా డ్రైనేజీశాఖదేనని, ఇరిగేషన్‌శాఖకు సంబంధం లేదని తెలిపారు.
బందరు కాలువ కట్టపై సగం హక్కు ఉంది: ఇరిగేషన్ ఏఈ
బందరు కాలువ కట్టపై సగం హక్కు తమకు ఉందని కంకిపాడు ఇరిగేషన్ ఏఈ వెంకటకృష్ణ చెప్పారు. ఈ కట్టపై మట్టి తవ్వకాలు చేపట్టాలంటే సాగునీటి సంఘం తీర్మానం చేయాలని, డ్రైనేజీ, ఇరిగేషన్‌శాఖలు సంయుక్తంగా ఆర్డర్ ఇవ్వాలన్నారు. కాని మట్టి తవ్వకాలకు డ్రైనేజీశాఖ ఆర్డర్ ఇచ్చిన విషయం తనకు తెలియదని అన్నారు.

జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటరులో వసతులు కల్పించండి
* ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ

మచిలీపట్నం, జూన్ 6: త్వరలో ప్రారంభం కానున్న పోలీసు కానిస్టేబుల్స్ శిక్షణకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో అన్ని సదుపాయాలు కల్పించి సిద్ధం చేయాలని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తాళ్లపాలెం గ్రామంలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. డిటిసిలో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పోలీసు కానిస్టేబుల్స్ శిక్షణ ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పించటంతో పాటు చిన్న చిన్న మరమ్మతులు ఉంటే తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ బివిడి సాగర్, స్పెషల్ బ్రాంచ్ డియస్‌పి జయరాజు, బందరు డియస్‌పి శ్రావణకుమార్, డిటిసి డియస్‌పి వెంకట రమణమూర్తి, ఎఆర్ డియస్‌పి నారాయణ తదితరులు పాల్గొన్నారు.