కృష్ణ

బతుకు పోరుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 14: సముద్రానే్న నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రులు ఆ సముద్రంలో మత్స్య సంపదను వేటాడేందుకు మళ్లీ లంగరెత్తారు. రెండు నెలల విరామం అనంతరం జీవన పోరాటానికి నడుం బిగించారు. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తికోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వతేదీ నుండి జూన్ 14వతేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు నెలల నిషేధిత కాలం తర్వాత నేటి నుండి మత్స్యకారులంతా సముద్రపు వేటకు సంసిద్ధులయ్యారు. మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రపు మొగ మేట వేసుకున్న కారణంగా ఒక రోజు ముందుగానే మత్స్యకారులు వేటకు బయలుదేరారు. సుమారు 40 నుండి 50 బోట్లు బుధవారం గిలకలదిండి హార్బర్ నుండి వేటకు బయలుదేరాయి. గురువారం మరో 40 నుండి 50 బోట్లు వేటకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం సముద్రం పోటు మీద ఉండటం వల్ల బోట్లు సముద్రపు మొగ దాటేందుకు కొంత వీలుగా ఉంది. రెండు రోజులు ఆగిపోతే పోటు తగ్గి బోట్లు వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి ఇక్కడ ఉంది. దీనిపై ఇటీవల రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మొగ పూడిక తీతకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నీరు-ప్రగతి కింద మొగ పూడిక తీతకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికీ ఆ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మొగ మేట వేసుకుపోవడం వల్ల బోట్లు సరైన సమయంలో వేటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అష్టకష్టాలు పడి బోటును మొగ వద్ద దాటించినా కింద మేట వేసుకుపోయిన ఇసుక వల్ల బోట్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మేట వేసుకుపోయిన మొగ వద్ద పూడిక తీయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 14వతేదీ నుండి మంగళవారం వరకు రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం ఉండటంతో మత్స్యకారులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. సముద్రంలో చేపలను వేటాడటం తప్ప మరే ఇతర పనులు రాని మత్స్యకారులు ఈ రెండు నెలలు దుర్భర జీవితాన్ని గడిపారు. వేట లేక, ప్రభుత్వం ఇస్తామన్న భృతి ఇవ్వకపోవటంతో అర్ధాకలితో అలమటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధిత కాలాన్ని రెండు నెలలు చేయటంతో పాటు జీవన భృతిని రూ.4వేలుకు పెంచింది. అయితే భృతిని సకాలంలో ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. జిల్లాలో మొత్తం 110 మెకనైజ్డ్ బోట్లు, 1300 మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగుతుంది. సుమారు 25వేల మంది మత్స్యకారులు జీవన భృతికి అర్హులుగా ఉన్నారు. సంబంధిత మత్స్యకారుల నుండి బ్యాంక్ అకౌంట్లను సేకరించిన సంబంధిత శాఖల అధికారులు అందరికీ భృతిని ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యారు.