కృష్ణ

జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 20: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని నూతన జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి తెలిపారు. కాకినాడ ఆర్‌జెడిగా వ్యవహరిస్తున్న దేవానందరెడ్డికి ప్రభుత్వం జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. మంగళవారం డిఇఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం తనకు కొత్తేమీ కాదన్నారు. గతంలో రెండు సంవత్సరాలు పైబడి డిఇఓగా పనిచేశానన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి విద్యాభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూస్తామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు నూరు శాతం అందేలా చూస్తామన్నారు. జిల్లాకు 2లక్షలు పైబడి పాఠ్య పుస్తకాల కొరత ఉందని, ఈ కొరతను వారం రోజుల్లో పరిష్కారిస్తామన్నారు. విద్యార్థులకు అందించిన ఏకరూప దుస్తుల కొలతల విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. త్వరలోనే సర్వశిక్షాభియాన్, విద్యా శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి విద్యార్థుల నుండి మళ్లీ కొలతలు తీసుకుని ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తామని డిఇఓ దేవానందరెడ్డి తెలిపారు. డిఇఓగా బాధ్యతలు స్వీకరించిన దేవానందరెడ్డిని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ లింగేశ్వరరావు, ఎడి పుష్పరాజ్, కార్యాలయ సూపరింటెండెంట్లు యువి సుబ్బారావు, పి వెంకటేశ్వరరావు, బాజీరావు, లావణ్య, ఎఎస్‌ఓ అశోక్ కుమార్ తదితరులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.