కృష్ణ

మూతబడ్డ వస్త్ర దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూన్ 27: జిఎస్పీని నిరసిస్తూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న వస్త్ర దుకాణాల బంద్ తొలి రోజైన మంగళవారం విజయవంతమైంది. బృందావనపుర నూలు మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. కార్యక్రమంలో సంఘం అ ధ్యక్ష, కార్యదర్శులు అయ్యప్ప రాము డు, తాడికొండ గుప్తా, ఉపాధ్యక్షుడు నారాయణరావు, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డలో...
అవనిగడ్డ : వస్త్ర దుకాణదారులు మంగళవారం అవనిగడ్డలో బంద్ నిర్వహించారు. వస్త్ర దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. పన్ను పూర్తిగా రద్దు చేసే వరకు వస్త్ర దుకాణాలను తీయమని హెచ్చరించారు. కార్యక్రమానికి సత్యనారాయణమూర్తి నాయకత్వం వహించారు.

కమీషన్ల కోసమే తాత్కాలిక పనులతో కాలక్షేపం
జగ్గయపేట, జూన్ 27: ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి తాత్కాలిక పనులకు ప్రాధాన్యత ఇస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దూలం నాగేశ్వరరావుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో తాత్కాలిక ఫలితాన్నిచ్చే పట్టిసీమపైన తాత్కాలిక రాజధాని నిర్మాణంపైన ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, అదే కేవలం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే పులిచింతల ప్రాజెక్టులో 42 టిఎంసిల నీరు నిల్వ ఉంచుకుని కృష్ణా డెల్టా మొత్తానికి నీరు అందించవచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరంపై దివంగత నేత రాజశేఖర రెడ్డి నాడు కృషి చేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు 2018కి పోలవరం ఇస్తున్నామని చెబుతున్నారని, ఇప్పటివరకు దానిలో నాలుగవ వంతు పనులు కూడా పూర్తి కాలేదని ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తామే గొప్పగా జూన్ నెలలోనే డెల్టాకు నీరు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, చంద్రబాబు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తప్ప గత ముఖ్యమంత్రుల హయాంలో జూన్‌లోనే డెల్టాకు సాగునీరు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. దేవినేని ఉమాపై ఆరోపణలు చేస్తూ కేవలం ముఖ్యమంత్రికి, ఆయన కొడుకుకి కమీషన్లు అందించేందుకే ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టిసీమ నీరు వస్తున్నదంటూ ఎన్నిసార్లు పూజలు చేసి ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ జగదీష్, జిల్లా అధికార ప్రతినిధి మదార్ సాహెబ్, వి.చెన్నకేశవవరావు తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి ప్రారంభోత్సవం వాయిదాతో
ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
విజయవాడ (రైల్వేస్టేషన్), జూన్ 27: విద్యాధర పురంలో ఏర్పాటైన ఆర్టీసీపై ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని అకారణంగా వాయిదా వేయడంపై ఉద్యోగ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, ముఖ్య కార్యదర్శి వి.దామోదరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఉన్న ఒకే ఒక్క ఆసుపత్రి తెలంగాణ ఆర్టీసీకి కేటాయింపు జరిగింది. దీంతో విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని అప్పటి గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ డిమాండ్ చేయడంతో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆసుపత్రి నిర్మించలేం అని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో కార్మికుల నుండి కొంత మేరకు ఆర్థిక సహాయం చేస్తామని మిగిలింది యాజమాన్యం డబ్బులో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు దీటుగా నిర్మించాలని చేసుకున్న ఒప్పందం మేరకు 2015 జూలై నుండి ప్రతి నెలా రూ.100 చొప్పున జీతంలో 60 వేల మంది ఉద్యోగుల వద్ద రికవరీకి అంగీకరించి నేటికి రూ.15 కోట్లు సమకూర్చుకుని నిర్మాణం చేపట్టిన ఆర్టీసీ ఆసుపత్రి యూనియన్ ఒప్పందం ప్రకారం గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సి ఉందన్నారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక సాకు చూపిస్తూ ఆసుపత్రి నిర్మాణం జాప్యం చేశారన్నారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన తరువాత కూడా గత రెండు నెలలుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తామని పదిసార్లు వాయిదాలు వేశారన్నారు. ఈ నెల 28న ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ రవాణా మంత్రి రావటం లేదని ప్రారంభోత్సవం వాయిదా వేయడంతో ఇప్పటికే తార్నాకలో రెండు నెలలుగా వైద్య సౌకర్యాలను ఆపివేయడం వలన విసుగు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ఆసుపత్రి వాయిదా విషయం తెలిసి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని వారు తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులకు తార్నాకలో వైద్య సౌకర్యాలు కల్పించాలంటే నెలకి తెలంగాణ ఆర్టీసీకి ఆంధ్రా నుండి 15 లక్షలు చెల్లించాల్సి వస్తుందని అక్కడి నుండి పనిచేస్తున్న సిబ్బందిని విజయవాడ తీసుకొని వచ్చి రెండు నెలలుగా వారికి ఎక్కడా పనిచేయించకుండా జీతాలు చెల్లిస్తున్నారన్నారు. అంతేకాకుండా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న సిబ్బంది గతం మూడు నెలలుగా ఎక్కడికి వెళ్లాలో తెలియక సుమారు 250 మంది ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లలేక, జీతాలు రాక రోడ్డున పడి ఉన్నారన్నారు.