కృష్ణ

ప్రయాణికులకు సదుపాయాల కల్పనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 15: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల ఆంక్షలు నెరవేర్చడానికి అంకితభావంతో కృషి చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తన సందేశంలో పేర్కొన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైల్వే మినీ స్టేడియంలో డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిఆర్‌ఎం ధనుంజయలు జాతీయ పతాకాన్ని ఎగుర వేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆర్‌పిఎఫ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సిసి వారు ఇచ్చిన కవాత్తు స్వీకరించారు. తరువాత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ పంపిన సందేశాన్ని ఆంగ్లంలో చదివి వినిపించారు. ఇందులో ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల ఆంక్షలు నెరవేర్చడానికి అంకితభావంతో కృషి చేస్తుందన్నారు. భారతీయ రైల్వేల మాదిరిగా స్వాతంత్య్రోద్యంతో సంబంధం కలిగిన సంస్థ మరొకటిలేదని చెప్పవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే స్వాతంత్య్రానంతరం భారతావని ప్రగతిలో నిబద్ధతతో కూడిన పాత్రను పోషిస్తూ అభివృద్ధికి బాటలు వేసి భారత రైల్వేలో ఉన్న ఉత్తమ జోన్‌లలో ఒకటిగా ఎస్‌సి రైల్వే గుర్తింపు పొందిందన్నారు. 2017, ఏప్రిల్, జూలై మాసాల మధ్య జోన్ స్థూల ఆదాయం గణనీయంగా వృద్ధి చెంది రూ. 4,320 కోట్లకు చేరి గత సంవత్సరం ఇదే మాసాలతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి చెందిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు 32.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధించామన్నారు. గత ఏడాది కంటే ఇది 4.5 శాతం ఎక్కువని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్, జూలై మాసాల మధ్య జోన్ స్థాయిలో ప్రయాణికుల సంఖ్య 130.87 మిలియన్‌లు కాగా గత సంవత్సరం ప్రయాణికుల సంఖ్య 126.41 మిలియన్లతో పోలిస్తే 3.4 శాతం అధికమని తెలిపారు. అలాగే భద్రత విషయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తాము గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు. రైల్వే వ్యవహారాల్లో ప్రయాణికులకు సాధ్యమైనంత భద్రత కల్పించడం కోసం విస్తృత స్థాయిలో తనిఖీలు, కౌన్సిలింగ్‌తోపాటు శిక్షణలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయన్నారు. 2017, ఏప్రిల్ - జూలై మధ్యకాలంలో రూ. 74.70 కోట్ల వ్యయంతో 48 కి.మీటర్ల మార్గాన్ని ఇప్పటికే పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఈపని ఏడాది పొడవున నిర్వీరామంగా కొనసాగుతునే ఉంటుందన్నారు. లోకో (విద్యుత్ రైలు ఇంజన్) పైలేట్ల సామర్ధ్యం పెంచేందుకు మూడు అంచెల మోడరన్ ఎలక్ట్రిక్ లోకో మోటీవ్ కిమ్యరేటర్‌ను విజయవాడలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డు అండర్ బ్రిడ్జీలతోపాటు లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద భద్రత నిర్వహణ కోసం ఇప్పటి వరకు రూ. 151.4 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రైల్వే సామర్ధ్యాభివృద్ధి, వౌలిక వసతులు అభివృద్ధిపై ఆధారపడి ఉందన్నారు. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 315.46 కి, మీటర్లు కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించాలని సంకల్పించడం జరిగిందని చెప్పడానికి ఆనందిస్తున్నామన్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొత్త రైల్వేలైన్లను కొంత మెర ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే దక్షిణ మధ్య రైల్వేలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను అదనంగా నడపడం జరిగిందన్నారు. అదే తరహాలో కొన్ని నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆ మార్గంలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని అదనపు బోగీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం రైల్వే హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరగా వివిధ విభాగాల్లో ప్రత్యేకతలను కనపర్చిన ఉద్యోగులకు చక్కటి ప్రదర్శనను ప్రదర్శించిన విద్యార్థులకు డిఆర్‌ఎం ధనుంజయలు నగదు పురస్కారాలు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె వేణుగోపాలరావు, సీనియర్ డిపిఓ ఎల్ నహేమియా, డిపిఓ సీతా శ్రీనివాస్, సీనియర్ డిసిఎం షిపాలి, సీనియర్ డిఓఎం చైతన్య, రైల్వే పాఠశాల గెజిటెడ్ హెడ్‌మాస్టార్ ఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.