కృష్ణ

ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బందరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి సాయిబాబు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణపై మంగళవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు ప్రారంభం నుండి నిమజ్జనోత్సవాలు ముగిసే వ రకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే వ్యక్తులను ము ం దుగా గుర్తించాలన్నారు. రాజకీయ వేదికలు మాదిరిగా కాకుండా ఆధ్యాత్మిక, భక్తి కేంద్రాలుగా చవితి పందిళ్లు ఉ ండాలన్నారు. ఆ దిశగా ఉత్సవ కమిటీ ప్రతినిధుల్లో చైతన్యం కల్పించాలన్నారు. చలువ పందిళ్ల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు ఉత్సవ కమిటీ లు తీ సుకునేలా చూడాలన్నారు. ప్రతి చ లువ పందిరికి విధిగా అధికారుల అ నుమతి ఉండాలన్నారు. నిమజ్జన తేదీలను కూడా ముందుగా తెలుసుకోవాలన్నారు. ఎటువంటి అసాంఘీక కా ర్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించవద్దన్నారు. ఈ సమావేశంలో డియస్పీ హుస్సేన్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మూర్తి, తహశీల్దార్ నారదముని, తాలుకా ఎస్‌ఐలు శ్రీనివాసు, మధు తదితరులు పాల్గొన్నారు.
కిలిమంజారా అధిరోహితుడు
ఉపేంద్రకు మంత్రి కొల్లు అభినందన
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 22: కిలిమంజారా అధిరోహించి భారతదేశ కీర్తిని చాటిన ఉపేంద్రను రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసుకరాళ్లపల్లి గ్రామానికి చెందిన ఉపేంద్ర ఈ నెల 15వతేదీన దక్షిణాఫ్రికాలోని కిలిమంజారా పర్వతాన్ని అధిరోహించి భారతదేశాన్ని ఎగుర వేశాడు. 4వేల 995 అడుగుల ఎత్తు కలిగిన కిలిమంజారాను అధిరోహించిన ఉపేంద్ర మంగళవారం మంత్రి కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర ఉపేంద్రను దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, సీనియర్ కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
25 నుండి జాతీయ సబ్ జూనియర్ బేస్‌బాల్ టోర్నీ
* ఏర్పాట్లను పరిశీలించిన నోడల్ అధికారి సుబ్బారావు
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 22: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సెప్టెంబర్ 25 నుండి 30 వరకు నిర్వహించనున్న 26వ జాతీయ సబ్ జూనియర్ బేస్‌బాల్ చాంపియన్‌షిప్‌కు నోడల్ ఆఫీసర్‌గా భారత క్రీడాప్రాధికార సంస్థ (శాయ్) అథ్లెటిక్స్ కోచ్ కెవి సుబ్బారావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం మచిలీపట్నం వచ్చిన ఆయన జాతీయ సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీలు నిర్వహించే మైదానం, క్రీడాకారులు, అధికారులకు వసతితో పాటు భోజన ఏర్పాట్లపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. శాప్ ఈ నెల 25వ తేదీ లోపు చాంపియన్‌షిప్ నిర్వహణ ఏర్పాట్లపై నివేదిక కోరిన సందర్భంగా ఆయన మంగళవారం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సుబ్బారావు చాంపియన్‌షిప్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి టోర్నీ ఏర్పాట్లను వివరించారు. మైదానాలను సందర్శించిన వారిలో రాష్ట్ర బేస్‌బాల్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి దారం నవీన్‌కుమార్, జిల్లా సంఘ చైర్మన్ కుర్రా నరేంద్ర, సభ్యులు రాజు తదితరులు ఉన్నారు.