కృష్ణ

ఉద్యోగులు మరింత శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఉద్యోగులు మరింతగా శ్రమించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉద్యోగులతో సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ విభజన నేపథ్యంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్‌లను ఐదు రెట్లు పెంపు చేసి ఉద్యోగుల జీతాల మాదిరిగా ప్రతి నెలా 1వతేదీన పెన్షన్ సొమ్ము అందిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించి ప్రతి పేద వాడికి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని చైర్‌పర్సన్ సమావేశంలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో డెప్యూటీ సిఇఓ కృష్ణమోహన్, జెడ్పీటిసిలు లంకే నారాయణ ప్రసాద్, దాసరి పద్మజ్యోతి, జెడ్పీ ఎఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
‘ఆదిభట్ల’ జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాలి
* ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 22: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు జీవితాన్ని పాఠ్యాంశంగా మార్చాలని ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. స్థానిక ఈడేపల్లి ప్రసన్నాంజనేయ స్వామి మందిరంలో తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవాలు మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరాయి. ముఖ్య అతిథిగా హాజరైన లంకిశెట్టి రాధికారాణి మాట్లాడుతూ అచ్చ తెలుగు పదాలతో హరికథకు వైభవం తీసుకు వచ్చిన మహనీయుడు ఆదిభట్ల అన్నారు. ఆదిభట్ల జీవిత విశేషాలను కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశంగా తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉడత్తు కిషోర్ మాట్లాడుతూ బహుభాషా కోవిదులు ఆదిభట్ల అన్నారు. అనంతరం ప్రముఖ హార్మోనిస్ట్ టి కనకాచారి, తబాలా, డోకల్ వాద్యకారులు యండి పెదబాబును ఘనంగా సత్కరించారు. మడమల రాంబాబు భాగవతార్ నర్తనశాల హరికథను మృధుమధురంగా గానం చేశారు. ప్రముఖ రచయిత్రి గుడిపూడి రాధికారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బండి వెంకట నాగలక్ష్మి, గుత్తికొండ సుబ్బారావు, పి వెంకటేశ్వరరావు, అప్పినేడి పోతురాజు, అనుముకొండ వెంకటేశ్వరరావు, కెకెడి మహాలక్ష్మి, దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.