కృష్ణ

ప్రతి పేదవానికి ఉచిత ఇసుక ప్రభుత్వ ధేయ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ప్రతి పేదవానికి ఉచిత ఇసుక సక్రమంగా అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. మండలంలోని రొయ్యూరు ఉచిత ఇసుక క్వారీని కల్పన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడుతూ ఒక ట్రాక్టర్‌లో (3 క్యూబిక్ మీటర్లు) ఒక యూనిట్ ఇసుక లోడింగ్ చేసినందుకు రూ.300 మాత్రమే కార్మికులు తీసుకోవాలని, రహదారి అభివృద్ధి మరమ్మతులకు మరో రూ.100 వసూలు చేయాలని తెలిపారు. అలాగే ఐదు కిలోమీటర్ల లోపు గ్రామాలకు ఇసుక రవాణాకు రూ.440, పది కిలోమీటర్ల లోపు గ్రామాలకు రవాణా చేస్తే రూ.660, ఆపైన దూరం ఉంటే ప్రతి కిలో మీటరుకు రూ.30 చొప్పున ట్రాక్టర్ల డ్రైవర్లు వసూలు చేయాలని కల్పన సూచించారు. ఈ మేరకు రేట్ల వివరాల బోర్డుని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.1800,2000 లభించేదని, ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు తక్కువ రేటుకే అందుతుందని చెప్పారు. అలాగే వైసిపి జడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతు మూడేళ్ళ ఖ్రితం డ్వాక్రా మహిళలు క్వారీ నిర్వహించగా వారికి రావాల్సిన రూ.18 లక్షలు ఇంత వరకు విడుదల కాలేదని, ప్రభుత్వం మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దాంతో ఎమ్మెల్యే కల్పన జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ జి భద్రు, ఎంపిడిఓ ఎస్‌ఈ పద్మసుధ, వైస్ ఎంపిపి కోటేశ్వరరావు, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, మండల టిడిపి అధ్యక్షుడు వీరపనేని శివరాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి లుక్కా రేణుకారావు, గ్రామ టిడిపి అధ్యక్షుడు విజయ్‌కుమార్, సీనియర్ నాయకుడు చాగర్లమూడి గోపాలరావు, మోర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పాములలంకలో జ్వరాలు తగ్గుముఖం
- కొనసాగుతున్న వైద్య శిబిరం
తోట్లవల్లూరు, ఆగస్టు 22: గతం వారం రోజులుగా పాములలంక గ్రామాన్ని అల్లాడించిన విషజ్వరాలు గురువారం తగ్గుముఖం పట్టాయి. మండలంలోని పాములలంకలో ప్రత్యేక వైద్య శిబిరం గురువారానికి నాల్గవరోజుకి చేరుకుంది. పాములలంక ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చిన జ్వరం బాధితులను డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ సీతమ్మ, డాక్టర్ గోపాలనాయక్ 91 మంది రోగులను పరిశీలించి చికిత్స నిర్వహించారు. వీరిలో 15 మందికి నీరసంగా ఉండటంతో సెలైన్ ఎక్కించామని, కొత్తగా నలుగురు జ్వరం బాధితులు వచ్చారని, మిగతా వారు పాత వారేనని గోపాలనాయక్ తెలిపారు. జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగిస్తామని తెలిపారు. అలాగే హెల్త్ సూపర్‌వైజర్ ఎం సోమరాజు ఆధ్వర్యంలో పాములలంక గ్రామంలో 380 గృహాల్లో ప్రతి యొక్క ఇంటికి మాలాతిన్, పైరత్రిన్ కిరోసిన్‌లో కలిపి దోమల నివారణకు ఊరంతా పిచికారి చేశారు.