కృష్ణ

రైళ్లలో దోపిడీ చేసే ముఠాపై అవసరమైతే కాల్పులు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వే స్టేషన్), ఏప్రిల్ 21: రైళ్లలో రాత్రి వేళల్లో ప్రయాణికుల నుంచి దోపిడీ చేసే దోపిడీ దొంగలపై అవసరమైతే కాల్పులకైనా వెనుకాడవద్దని గుంతకల్లు జిఆర్‌పి ఎస్‌పి సుబ్బారావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలం ఆరంభం కాకముందే మార్చి, ఏప్రిల్ నెలల్లో గుంతకల్లు డివిజన్ రెండు ప్రాంతాల్లో హైదరాబాద్‌లోని ఒక ప్రాంతంలో తీవ్రమైన దోపిడీ జరిగిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం గుంతకల్లు స్టేషన్‌లోని ఎస్‌పి కార్యాలయం నుంచి అధికార పూర్వకంగా గుంతకల్లు ప్రభుత్వ రైల్వే పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారావు పెరిగిన వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైళ్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దోపిడీ దొంగల నుంచి విముక్తి కల్పించటం కోసంతో పాటు వారిలో జిఆర్‌పి పోలీసులు బలగాలు ఎస్కాట్‌గా ఉన్నారని మనోభావాలు వెల్లడయ్యే విధంగా తీవ్రమైన ఆదేశాలు జారీ చేశారు. రైలును ఎక్కడైనా మార్గమధ్యంలో చైన్ లాగటం గాని, మరే ఇతర కారణాల వలను గాని రైళ్లను నిలిపిన వెంటనే ఎస్కాట్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అనుమానాస్పదంగా పారిపోతున్న వారిపై కాల్పులు జరపాలని ఆదేశించారు. అయితే విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే డివిజన్ పరంగా గూడూరు జంక్షన్ వరకు ఉన్నా జిఆర్‌పి పరిధిలో విజయవాడ ఎస్‌పి ఆధ్వర్యంలో బాపట్ల వరకు మాత్రమే ఉంది. అక్కడి నుంచి గుంతకల్ డివిజన్ పరిధిలోకి ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట ప్రాంతాలు వస్తాయి. ఇక్కడ విజయవాడ జిఆర్‌పి వారి ఆధ్వర్యంలోనే జిఆర్‌పి ఎస్కాట్ బాపట్ల పరిధి దాటి గూడూరు, తిరుపతి వరకు కూడా విధులు నిర్వహిస్తున్నారు. గుంతకల్ ఎస్‌పి ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ బాపట్ల దాటిన తరువాత వచ్చే గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చీరాల స్టేషన్ దగ్గరి నుంచి పలు ప్రాంతాల్లో రైళ్లలో దోపిడీలు జరుగుతున్న గుర్తించిన ప్రదేశాల్లో కాని మరే ప్రాంతాల్లోనైనా కాని దోపిడీ సంఘటనలు జరిగినట్లైతే వెంటనే కాల్పులు జరిపే ఆదేశాలు వీరికి కూడా విస్తరిస్తున్నట్లు గుంతకల్ ఎస్‌పి పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆదేశాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని సమాచారం.