కృష్ణ

ఐలయ్య దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 12: ఆర్య వైశ్యులు సామాజిక స్మగ్లర్లు అని విశ్రాంత ప్రొ. కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక కోనేరుసెంటరులో ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు, వాణిజ్య సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో మంగళవారం ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఐలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలన్నారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే గురువారం ఉదయం పట్టణంలోని ఆర్య వైశ్య సంఘాలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గురువారం షాపులన్నింటినీ బంద్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనృసింహ సోమయాజి వైశ్య సమాజం అధ్యక్షుడు జీవి గున్నయ్యశెట్టి, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తగుండు రమేష్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల గిరీష్, మామిడి మురళీకృష్ణ, ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్నిధి నాగసాయి, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్‌చైర్మన్‌లుగా అరికేపూడి, మూడెడ్ల
గుడివాడ, సెప్టెంబర్ 12: గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా అరికేపూడి రామశాస్ర్తీ, వైస్‌చైర్మన్‌గా మూడెడ్ల సూర్యనారాయణలు నియమితులయ్యారు. చైర్మన్ పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతుండడంతో మూడున్నరేళ్ళుగా కమిటీ నియామకం జరగలేదు. ఎట్టకేలకు నియమించిన కమిటీ డైరెక్టర్లుగా లింగం శివరావు, ఆర్ సురేష్‌కుమార్, వీరిశెట్టి కొండలరావు, అంగడాల వీర్రాజు, తోట నాగరాజు, బాలసాని శాంతకుమారి, అబ్దుల్ మున్వర్, వర్రే ఈశ్వరరావు, సుంకర వెంకట కుటుంబరావు, చిటిబొమ్మ నరసింహారావు, నాదెళ్ళ రాజేశ్వరరావు, కొత్తా మురళీకృష్ణారావు, ఈడే సుధాకర్‌లు నియమితులయ్యారు.

స్కిల్ డెవలప్‌మెంట్ భవన నిర్మాణానికి మట్టి శాంపిల్
పెదపారుపూడి, సెప్టెంబర్ 12: స్కిల్ డెవలప్‌మెంట్ భవన నిర్మాణానికి మట్టి నమూనాలను తీయడం జరిగిందని ఎంపిపి కాజ విజయలక్ష్మి చెప్పారు. మంగళవారం ఎండివో కార్యాలయం ఎదుట ఉన్న స్థలంలో భవనాన్ని నిర్మించేందుకు భూమి అనువుగా ఉందో, లేదో తెలుసుకోవడానికి మట్టిని పరీక్షించేందుకు తీసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పెదపారుపూడి వచ్చిన సందర్భంగా భవన నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరు చేశారన్నారు. పంచాయతీరాజ్ ఎఈ రాఘవరావు మాట్లాడుతూ భవన నిర్మాణానికి ప్లాన్ సిద్ధంగా ఉందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సింహాద్రి పాల్గొన్నారు.