కృష్ణ

తెలుగు సంస్కృతికి కాణాచి కళాతపస్వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 12: కళాతపస్వి, దాదాసాహెబ్‌పాల్కె అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ తెలుగు సంస్కృతికి నిలువుటద్దమని పలువురు వక్తలు కొనియాడారు. విశ్వనాథ్‌కు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించగా బందరు ఎంపి కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తదితరులు ప్రసంగిస్తూ మన ప్రాంతంలో విశ్వనాథ్ పుట్టడం మనకు గర్వకారణమన్నారు. ఆయనకు గురుపూజ నిర్వహించడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన ఒక కారణ జన్ముడని, తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన రుషి పుంగవుడని అభివర్ణించారు. ఆయన ఒక నిశ్శబ్ద విప్లవమన్నారు. సంఘ సంస్కరణకు ఆయన విశేష కృషి చేశారన్నారు. ఈ సమావేశానికి ప్రముఖ గాయకుడు లక్కావజ్జుల బాల గంగాధరశాస్ర్తీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జయ విశ్వనాథ.., ఔరా అమ్మకుచెల్లా.., గురుసాక్షాత్ పరబ్రహ్మ.., శివాని భవాని.., సరిగంగ స్నానాలు.., హైలోహెలెస్సా.., కోనకోనల్లో.. అనే నృత్య నీరాజనాలను దాదాపు 1200 మంది విద్యార్థులు ప్రదర్శించగా ఎంతగానో ఆకట్టుకుంది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన లక్కావజ్జుల గంగాధరశాస్ర్తీ విశ్వనాథ్ గొప్పతనాన్ని సోదాహరణగా వివరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ను నూతన వస్త్రాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఉచిత రీతిన విశ్వనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.