కృష్ణ

వరికి మద్దతు ధర 2వేలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: దేశంలో ప్రధాన పంటగా వున్న వరికి కనీస మద్దతు ధరను రూ.2వేలకు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఎసిపి 2016-17 సంవత్సరానికి వరికి మద్దతు ధరను రూ.60లకు పెంచి రూ.1470లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రూ. 60 పెంపుదల రైతు ఏమాత్రం ఆదుకోలేదన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమి టీ సిఫార్సుల మేరకు ఉత్పత్తి ధరకు 50శాతం జోడించి కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. ప్రస్తుత తరుణం ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీరేట్లు, డీజిల్ ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో కచ్చితంగా క్వింటాల్‌కు రూ. 2500లు మద్దతు ధర ఉంటే తప్ప రైతుకు గిట్టుబాట కాదన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించదలచుకుంటే వరికి రూ.2వేలు కచ్చితమైన గిట్టుబాటు ధర ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

రూ.5కోట్లతో ఉపాధి హామీ పనులు
మచిలీపట్నం, ఏప్రిల్ 21: బందరు నియోజకవర్గంలో అత్యధికంగా ఐదు కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మండల పరిధిలోని చిన్నాపురం శివారు వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మంచినీటి చెరువు తవ్వకం పనులను గురువారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌జిఎస్ కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.3కోట్ల మేర పనులు జరిగాయని, మరో రూ.5కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. అత్యధికంగా 5500 పని దినాలు కల్పించినట్లు తెలిపారు. ఎంత ఎక్కువ పనులు చేస్తే అంత ఎక్కువ నిధులు కేంద్రం నుండి వచ్చే అవకాశం ఉందన్నారు. పనులు చేసే కూలీలకు కూడా అత్యధికంగా రూ.194లు వచ్చే అవకాశం ఉందన్నారు. వేసవి కరువు పరిస్థితుల్లో ఈ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకుని కూలీలకు పనులు కల్పించడం ద్వారా వారి జీవనోపాధి పెంపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీలో రూ.6వేల కోట్ల మేర పనులు జరిగే అవకాశం ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం తదితర పథకాల కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు కిలో మీటర్ల మేర రహదారులు నిర్మించామన్నారు. మరో 10కిలో మీటర్ల మేర రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చిన్నాపురం గ్రామానికి ఈ చెరువు తవ్వకం వల్ల మంచినీటి సమస్య పరిష్కారం కాగలదన్నారు. చెరువు తవ్విన మట్టిని జడ్‌పి హైస్కూల్ ఆవరణ మెరక చేయుటకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. పనుల పరిశీలన అనంతరం చిన్నాపురం-కమ్మవారి చెరువు రహదారి విస్తరణ కోసం ఎలక్ట్రానిక్ బోటల్ స్టేషన్ సర్వే పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, సర్పంచ్ ధనమణి, ఎంపిడివో జివి సూర్యనారాయణ, పంచాయతీ రాజ్ ఎఇ జవహర్ లాల్, ఎపిఓ అశోక్ పాల్గొన్నారు.

‘విజిలెన్స్’ సమావేశం ఎప్పుడో?
* 16 నెలలుగా జరగని కమిటీ సమావేశం
* పరిష్కారానికి నోచుకోని దళితుల సమస్యలు
మచిలీపట్నం, ఏప్రిల్ 21: దళితుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న పాలకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దళిత సమస్యల పరిష్కార వేదిక అయిన ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని గత 16 నెలలుగా నిర్వహించిన పాపాన పోలేదు. దీంతో దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే ఈ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, దళిత వర్గాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విజిలెన్స్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న దాడులు, వివక్షత తదితర అంశాలపై చర్చిస్తారు. కానీ గత 16 నెలలుగా ఈ సమావేశాన్ని నిర్వహించకుండా అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. చివరి సమావేశాన్ని 2014 డిసెంబర్ 27న నిర్వహించారు. 2015 ఏప్రిల్ 6న నూతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. కానీ నూతన కమిటీ ఏర్పాటుకు ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 45లక్షల 17 వేల 389 మంది జనాభా ఉండగా ఇందులో 8లక్షల 71వేల 63 మంది ఎస్సీలు ఉన్నారు. అంటే 2.9 శాతం మంది ఎస్టీలున్నారు. ఈ కమిటీ సమావేశంలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పురోగతిపై ప్రధాన చర్చ ఉంటుంది. కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నిలదీసే హక్కు ఈ కమిటీకి ఉంది. ఈ నేపథ్యంలో కమిటీ సమావేశాలు జరగకపోవటంతో ఉన్న కేసులు పరిష్కారం కాకపోగా కొత్తగా మరిన్ని కేసులు పెండింగ్ జాబితాలోకి చేరుతున్నాయి.

సిఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
గన్నవరం, ఏప్రిల్ 21: సూరంపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాబు ఎ గురువారం పరిశీలించారు. తొలుత కలెక్టర్ బాబు ఎ హెలిప్యాడ్ నిర్మాణపు పనులను పరిశీలించారు. హెలిప్యాడ్ సాంకేతికంగా, కట్టుదిట్టంగా నిర్మించాలని ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి నామేశ్వరరావును ఆదేశించారు. కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ సీపెట్ సంస్థ స్థాపించడం వలన ఈ ప్రాంత ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇంటర్ చదివి విద్యార్థులు ఈ సంస్థలో శిక్షణ పొందితే ఉద్యోగాలు తప్పక వస్తాయన్నారు. భారతదేశంలో ఈ సంస్థ ఆరోదని తెలిపారు. ఇంటర్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను సమావేశానికి హాజరయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా, విజయవాడ సబ్ కలెక్టర్ డాక్టర్ జీ సృజన, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖరరాజు, తహశీల్దార్ ఎం మాధురి, సంస్థ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రచంఢభానుడు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 21: భగభగమండే భానుడు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. రోహిణీ కార్తె రాకముందే భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు భీతిల్లుతున్నారు. స్థూలకాయం వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉక్కపోత కారణంగా శ్వాసతీసుకోవటానికే ఇబ్బందికరంగా మారింది. చెమటలు పట్టడంతో ఒళ్ళు అంతా దురదలు, పొక్కులు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా వడదెబ్బ తగలటంతో నీరసించి ఆసుపత్రుల పాలవుతున్నారు. అలాగే తాటాకు ఇళ్ళల్లోనే వేడి మండుతుంటే డాబాలు, రేకుల షెడ్లలో నివశించే ప్రజలు వేడికి అతలాకుతలమవుతున్నారు. వాహన చోదకులు మాస్క్‌లు ధరించి ప్రయాణం చేస్తున్నారు. వేడి గాలులకు ప్రయాణీకుల ముఖం వాడిపోతుంది. దీంతో సాయంత్రానికి నీరసించిపోతున్నారు. అలాగే పావుగంట కరెంట్ కట్ చేస్తే చాలు ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. బయట ఉన్నా, ఇళ్ళల్లో ఉన్నా ఒక్కలాగానే ఉంటుంది. ఇళ్ళల్లో సైతం ఫ్యాన్ గాలి వేడిగా వస్తుంది. దీంతో పగటిపూట పసికందులు ఉన్న గృహాలు ఏడ్పులతో మోతమోగిపోతున్నాయి. ఎంత వారించినా ఏడ్పు మాత్రం మానటం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ విధంగా అల్లాడుతుంటే బడాబాబులు, డబ్బులున్నవారు మాత్రం ఉదయం 10గంటల కల్లా ఏసి గదుల్లోకి వెళ్ళిపోయి సాయంత్రం 6గంటలకు బయటకు వస్తున్నారు. అయితే రెక్కాడితేకాని డొక్కాడని కార్మికులు మాత్రం ఎండలోనే పని చేయక తప్పదు. దీంతో వారు సాయంత్రానికి నీరసించి మంచానికి అతుక్కుపోతున్నారు. పల్లెల్లో చెట్లకింద మంచాలు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీన్ని అదునుగా చేసుకుని పట్టణంలో వందల సంఖ్యలో చెరుకు రసం బండ్లు, శీతల పానియాల కేంద్రాలు ఏర్పాటయ్యాయి. చల్లటి ఐస్ ముక్కలు వేయటంతో దాహంతో ఉన్న వారు శీతల పానియాలను గటగటాతాగేస్తున్నారు. తీరా చూస్తే బిల్లు మాత్రం తడిసి మోపెడవుతోంది.

అగ్ని ప్రమాదంలో రూ.లక్షా 30వేల ఆస్తినష్టం
కూచిపూడి, ఏప్రిల్ 21: మొవ్వ అగ్నిమాపక కేంద్రం పరిధిలో గురువారం జరిగిన రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో రూ.లక్షా 30వేల ఆస్తినష్టం సంభవించినట్లు ఇన్‌ఛార్జి అధికారి గొంతుపులి వెంకటేశ్వరరావు తెలిపారు. మొవ్వ గ్రామంలో చలసాని నాగేశ్వరరావుకు చెందిన ఎపి 07వి 4445 మధ్యాహ్నం ఎండ వేడిమి లారీ అద్దాలపై పడటంతో క్యాబిన్‌లో ఉన్న ఆయిల్ గుడ్డలు కాలి దగ్ధమయ్యాయి. ఈ మంటలు సమీపంలోని వరిగడ్డి కుప్పను కూడా దగ్ధం చేశాయి. సమాచారం తెలుసుకున్న వెంకటేశ్వరరావు సిబ్బందితో హుటాహుటిన తరలి వచ్చి మంటలను అదుపు చేసి పక్కన ఉన్న పాకలకు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే ఘంటసాల మండలం చినకళ్ళేపల్లిలో కంటిపూడి శ్రీనివాసరావుకు చెందిన ఐదెకరాల వరిగడ్డి వామి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది.

పాతఉపకాలిలో పూరిల్లు దగ్ధం
నాగాయలంక, ఏప్రిల్ 21: మండల పరిధిలోని సంగమేశ్వరం శివారు పాత ఉపకాలి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొక్కిలిగడ్డ నాగరాజుకు చెందిన నివాస గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో నిప్పురవ్వలు లేవటంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటల వ్యాపించటంతో ఇంట్లోని వారంతా బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.80వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కలిదిండి, ఏప్రిల్ 21: బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన గురువారం మండల పరిధిలోని కోట కలిదిండిలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన కుప్పాల శ్రీనివాసరావు కుమార్తె నాగలక్ష్మి(16) కైకలూరుకు చెందిన మేనత్త కొడుకుతో వివాహం ఈనెల 22న నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పెండ్లి ముహూర్తం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. బాలిక కలిదిండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వివాహం అయిన తరువాత చదువు చెప్పిస్తానని బంధువులు అనడంతో కుమార్తె తండ్ర