కృష్ణ

సమన్వయం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలు అన్ని శాఖలు సమన్వయంతో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం వెల్లడించారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దసరా మహోత్సవాల నిర్వహణకు నియమితులైన అధికారులు, సిబ్బందితో కలెక్టర్ బి లక్ష్మీకాంతం, నగర పోలీసు జాయింట్ కమిషనర్ బివి రమణకుమార్, దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఎ సూర్యకుమారి ఇతర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గాశరన్నవరాత్రులు 21 నుండి 30వరకు రాష్ట్ర పండుగగా నిర్వహించటానికి పకడ్బంధీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వినాయకుని గుడి నుండి కొండపై వరకు అదే విధంగా కుమ్మరిపాలెం నుండి క్యూలైన్లలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాలను ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తును పోలీసుశాఖ పర్యవేక్షిస్తుందన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంలో తగిన సమాచారం కోసం 0866 2474700, 0866 2474701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు. తెప్పోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. వీరితోపాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ రక్షణ దళం 9రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. వీరంతా 20న నిర్వహించే రిహార్సల్‌లో పాల్గొని తమకు కేటాయించిన కేంద్రాల్లో రిపోర్టు చేయవలసి ఉంటుందని ఆయన వెల్లడించారు. జాయింట్ పోలీసు కమిషనర్ బివి రమణకుమార్ మాట్లాడుతూ 19 నుండి పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో రిపోర్టు చేస్తారన్నారు. డిసిపి క్రాంతి రాణా తాతా మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు 4,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్కింగ్‌కు సంబంధించి కుమ్మరిపాలెం వద్ద ఉన్న పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణవేణి ఘాట్‌లతోపాటు కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు పార్కింగ్ ఏర్పాటు చేస్తామని రాణా తెలిపారు. దుర్గగుడి ఇవో సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మల్టీ డిసిప్లినరీ టీంల ద్వారా ఉత్సవాలను విజయవంతం చేయటానికి దేవస్థానం అధికారులు పని చేస్తారని ఆమె తెలిపారు. దివ్యాంగులు కోసం రాజీవ్‌గాంధీ పార్క్ వద్ద పికప్ పాయింట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇవో సూర్యకుమారి తెలిపారు. మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం 0866 6453800, 0866 6455744 ఫోన్ నెంబర్లలో తగు సమాచారం కోసం సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. నగరపాలక కమిషనర్ జె నివాస్ మాట్లాడుతూ నగరంలో 20 ప్రదేశాల్లో 3 ఫిప్టుల్లో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ విధి నిర్వహణ గతంలో తాము విధులు నిర్వహిస్తున్నప్పటికీ తదునుగుణంగా నిర్దేశించిన విధుల నిర్వహణలో సజావుగా చేసే విధంగా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరంలో జరిగిన అనుభవాలను తీసుకోవాల్సిన చర్యలు గురించి డిఆర్వో రంగయ్య, విజయవాడ, గుడివాడ ఆర్‌డివోలు ఎస్ హరీష్, ఎం చక్రపాణిలతో పాటు పిషరీస్ జెడి, డిప్యూటీ డిఎంహచ్‌వో, జిల్లా అగ్నిమాపక అధికారి, ఎస్‌పిడిఎల్, ఇంజనీర్లు, తమకు శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను ఈ సమావేశంలో వివరించారు.

లంచం డిమాండ్‌పై విచారణ
* ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆదేశం

విజయవాడ, సెప్టెంబర్ 18: పాత ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుపై ఆర్డీవోను తక్షణమే విచారణ జరిపి నివేదికను సమర్పించాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం ఆయన పాత ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. భవానీపురానికి చెందిన బాలింత సుమతి మాట్లాడుతూ తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగిందని, ఐదురోజులుగా ఆసుపత్రి సిబ్బంది రూ. 200 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చింది. దీనిపై స్పందించిన ఆయన తక్షణమే సంఘటనపై ఆర్డీవోను విచారణాధికారిగా నియమిస్తూ పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జరిగిన సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ వివరణ కోరారు.