కృష్ణ

దసరా శోభ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 18: దసరా మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు అంటూ చెబుతున్న దుర్గగుడి అధికారులు ప్రధాన ఆలయంతో పాటు ప్రాకార మండపానికి సైతం రంగులు వేయించపోవటంతో భక్తుల నుండి విమర్శలు వస్తున్నాయ. ప్రతి ఏడాది దసరా మహోత్సవాలు ప్రారంభం కావటానికి సుమారు నెలరోజుల ముందు నుంచే ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలకు రంగులు వేసేవారు. కొండపై వున్న రాజగోపురం, ప్రధాన ఆలయం, ప్రాకారం మండపం, 2 ఉపాయాలకు నేటి వరకు రంగులు వేయించే ఆలోచన అధికారులు చేయకపోవటంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రూ.15కోట్లతో దసరా మహోత్సవాలంటూ పదేపదే చెబుతున్న అధికారులు ఆలయానికి రంగులు వేయించే విషయంలో ఉన్న అభ్యంతరాలు స్పష్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘాట్‌రోడ్ ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకునే ముందు ఎదురుగా ఉన్న రాజగోపురానికి ఎండిపోయిన మామిడి తోరణాలు భక్తులకు దర్శనమివ్వటం చూస్తే అధికారుల ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. ఘాట్‌రోడ్ మెయిన్ గేట్ వద్ద శ్రీకామధేన్ అమ్మవారి ఆలయానికి సైతం నేటి వరకు రంగులు వేయకపోవటం విశేషం. అసలు ఇప్పటి వరకు అధికారులు చేసిన ఏర్పాట్లు ఏమిటో చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రత్యేక ఉభయదాతల పూజల టిక్కెట్ అమ్మకాలు కూడా ఈఏడాది అంతంత మాత్రమేగానే ఉన్నాయని సిబ్బంది లోపయకారిగా అంగీకరిస్తున్నారు. గతంలో భక్తులు దుర్గమ్మ దర్శనం చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారు 2గంటల వ్యవధిలో దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవటంతో భక్తులు ప్రత్యేక ఉభయదాతల టిక్కెట్‌లను కొనుగోలు చేసే విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. భక్తుల మనోభావాలను పరిగణనలోనికి తీసుకుంటే అధికారులు ఆశించిన రీతిలో టిక్కెట్ అమ్మకాలు ఉండవని అర్థం అవుతుంది. 27న మూలా నక్షత్రం సందర్భంగా 3 బ్యాచ్‌లుగా విభజించి టిక్కెట్ అమ్మకాలు ప్రారంభించినప్పటికీ కౌంటర్లల్లో ఇంకా నిల్వలు ఉన్నాయి. గతంలో టిక్కెట్ అమ్మకాలు ప్రారంభించిన వెంటనే తొలుత మూలా నక్షత్రం రోజున టిక్కెట్‌లను భక్తులు కొనుగోలు చేసేవారు. అలాగే వాల్ పోస్టర్లను సైతం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన సెంటర్లల్లో అందరికీ తెలిసేలా అంటించేవారు. ఈ కార్యక్రమంతోపాటు ఉభయ రాష్ట్రాల్లోని గురుభవానీలకు దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా వాల్‌పోస్టర్లలతోపాటు దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికలను పంపేవారు. ఈ ఏడాది ఏ జిల్లాకు పంపకపోవటంతో గురుభవానీలు అధికారుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడికి ఐఎయస్ అధికారి ఇవోగా వస్తే మరింత అభివృద్ది జరుగుతోందని, మరింత ప్రచారం లభిస్తోందని భక్తులు భావిస్తే అందుకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొనడంతో వారు వీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.