కృష్ణ

దిలీప్ బుల్డ్‌కాన్ వాహనాలు అడ్డుకుంటే అరెస్ట్‌లు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, సెప్టెంబర్ 18: దిలీప్ బుల్డ్ కాన్‌కు చెందిన వాహనాలు అడ్డుకుంటే అరెస్ట్‌లు తప్పవని విజయవాడ సబ్ కలెక్టర్ హరీష్ ప్రజలను హెచ్చరించారు. జి.కొండూరు మండల పరిధిలోని వెలగలేరులో ఆయన సోమవారం గ్రామస్థులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై చర్చించారు. ఈయనతో పాటు జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, ఎంపిపి వేములకొండ తిరుపతిరావు, తహశీల్దార్ కె సుధారాణి, ఎంపిడిఓ బిఎం లక్ష్మీకుమారి, మైలవరం సిఐ రామచంద్రరావు, ఎస్‌ఐ డి రాజేష్ తదితరులు కూడా గ్రామస్థులతో చర్చించారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఎప్పటి నుంచో వెలగలేరు మీదుగా ట్రాఫిక్‌ను మళ్ళిస్తున్నారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం సరఫరా చేస్తున్న క్రషర్ మెటీరియల్ అంతా జి.కొండూరు నుంచి వెలగలేరు మీదుగా దిలీప్ బుల్డ్‌కాన్‌కు చెందిన భారీ టిప్పర్లలో రవాణా జరుగుతోంది. ఈటిప్పర్ల వల్ల వెలగలేరు గ్రామస్థులు ఎప్పటినుంచో నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై జరుగుతున్న చర్చల్లో భాగంగా గ్రామస్థులు వారి డిమాండ్లను సబ్ కలెక్టర్‌కు తెలియచేశారు. ముందుగా రోడ్డును వెంటనే మరమ్మతులు చేసిన తర్వాతనే భారీ వాహనాలు ఇటువైపుగా మళ్ళించాలన్నారు. కానీ సబ్‌కలెక్టర్ మాత్రం వాహనాలను అడ్డుకోవద్దని, పది రోజుల్లో రహదారిని అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వాహనాలు అడ్డుకుంటే అరెస్ట్ చేయాలని పోలీసులను సబ్‌కలెక్టర్ ఆదేశించారు. దీనిపై ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య అధికారుల పెత్తందారీ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవలు చేయాల్సిన అధికారులు ఇలా మాట్లాడటం భావ్యం కాదని, అరెస్టులకు ప్రజలతో పాటు తాను సిద్ధమేనని ప్రకటించారు. మళ్ళీ ప్రజలతో చర్చించి సమస్యను సానుకూలంగా పరిష్కరించారు. వెలగలేరు నుంచి వెళ్ళే వాహనాలు వరకూ అనుమతిస్తామని, తిరిగి వచ్చే వాటిని జక్కంపూడి నుంచి మళ్ళించాలని ప్రజలు కోరగా, దీనిపై కలెక్టరుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. రోజుకు రెండుసార్లు రోడ్డుపై దుమ్ము లేవకుండా వాటరింగ్ చేయిస్తామని, పదిరోజుల్లో గోతులను పూడ్చి మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపిటిసి పోలుదాసు వెంకటలక్ష్మీ, సర్పంచ్ మెండ్యాల భూపతమ్మ, గ్రామస్తులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మరింత అందుబాటులోకి పోలీసు సేవలు
* జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి

మచిలీపట్నం, సెప్టెంబర్ 18: పోలీసు సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ‘మీకోసం’ దోహద పడుతుందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘మీకోసం’ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ బాధితులు తమ తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు ‘మీకోసం’ మంచి వేదిక అన్నారు. మీకోసంలో వచ్చే ఫిర్యాదులపై తక్షణ పరిష్కార చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, ఎఆర్ అడిషనల్ ఎస్పీ పికె శేఖర్, ఎఆర్ డియస్పీ నారాయణరావు, ఆర్‌ఐ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.