కృష్ణ

రక్తదానం ప్రాణదానంతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 21: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎల్బీఆర్సీఇ ప్రిన్సిపాల్ కె అప్పారావు అన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గురువారం కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రక్తదానం చేయటం వల్ల ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లు అవుతోందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ మదన్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇచ్చే రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాల సందర్భంగా, అవసరమైన వారికి తమ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ద్వారా రక్తం ఉచితంగా అందించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈశిబిరంలో 82 మంది విద్యార్థులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. వీరిని కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు కె తిమ్మారెడ్డి, కాశిరెడ్డి తదితరులు అభినందించారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
* మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 21: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. విజయకృష్ణ కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ 15వ వార్షికోత్సవం, దసరా సెలవులను పురస్కరించుకుని స్థానిక చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ క్రీడా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సుశిక్షితులైన క్రీడాకారులకు శిక్షణ ఇప్పించటంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, ఫిజికల్ డైరెక్టర్ బి రమేష్, సంస్థ కార్యదర్శి సికినం కాళిదాసు, కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.