కృష్ణ

గ్రామాలపై నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 21: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. గురువారం గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ దొండపాడు వంతెన సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఆందోళన చేయవద్దని, వెంటనే విరమించాలని పోలీసులు కోరడంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొడాలి నాని ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గుడివాడ పట్టణానికి సమీపంలో ఉన్న వలివర్తిపాడుకు 3కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ఉందన్నారు. ఈ రోడ్డు పూర్తిగా పాడైందని, 3నిమిషాల్లో చేరుకోవాల్సిన వారు 30నిమిషాల పాటు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ఈ విషయాన్ని టిడిపి నాయకులకు గ్రామస్థులు వివరించినా పట్టించుకోలేదని, రోడ్డు సమస్యను జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళేందుకు గ్రామస్థుల సహకారంతో ఆందోళన చేపట్టామన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.70లక్షల నిధులు అవసరమన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం ఏ మాత్రం వాస్తవమో వలివర్తిపాడు గ్రామాన్ని చూసి తెలుసుకోవచ్చన్నారు. నెల రోజుల్లో వలివర్తిపాడు రోడ్డు సమస్యను పరిష్కరించాలన్నారు. లేకుంటే వలివర్తిపాడుతో పాటు రూరల్ మండలంలోని బిళ్ళపాడు, బొమ్ములూరు, మల్లాయిపాలెం గ్రామాల్లోని రోడ్లను కూడా నిర్మించాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజల సహకారంతో మహాధర్నా చేపడతానని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపి మండల అధ్యక్షుడు మట్టా జాన్‌విక్టర్, వలివర్తిపాడు సర్పంచ్ శాయన, వైసీపి గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా నేత పాలేటి చంటి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
* కేంద్ర మంత్రి సుజనా
ఉయ్యూరు, సెప్టెంబర్ 21: అవినీతిలేని, పారదర్శక సుపరిపాలనను అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అభిప్రాయం వ్యక్తం చేసారు. స్థానికంగా శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ స్వగృహంలో గురువారం జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో ఆయన తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేఖరులతో మాట్లాడుతూ మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదని, కేంద్రం అవినీతిరహిత పాలనను అందిస్తున్నదని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న పధకాలు సామాన్యులను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, స్థానికంగా జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో తాను పాల్గొన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, ఎఎంసి వైస్‌చైర్మన్ దాసు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు భీమవరపు పిచ్చిరెడ్డి, చేదుర్తిపాటి ప్రవీణ్, రాజులపాటి ఫణి తదితరులు పాల్గొన్నారు.