కృష్ణ

కలాస్‌మాలపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 21: తోట్లవల్లూరు శివారు కలాస్‌మాలపల్లిలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఏట్టకేలకు వైద్యశాఖ స్పందించి ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేయటంతో జ్వరంతో బాధపడుతున్న వారందరూ ఈ శిబిరంలో చికిత్స చేయించుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం వద్ద పిహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గోపాలనాయక్, ఎఎన్‌ఎంలు ప్రమీలారాణి, నిర్మలామేరి, ఎం రోహిణి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గోపాలనాయక్ మాట్లాడుతూ కొత్త జ్వరాలు లేవని, అందరు పాతవారేనని తెలిపారు. పిహెచ్‌సికి రోజుకి 150 మంది ఓపి రోగులు వస్తున్నందున ఎక్కువ సమయం అక్కడ వెచ్చిస్తున్నామని, కలాస్‌మాలపల్లిలో ఎఎన్‌ఎంలను నియమించామని తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయటంతో కలాసమాలపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు
మొవ్వ జెడ్పీ విద్యార్థులు ఎంపిక
కూచిపూడి, సెప్టెంబర్ 21: మొవ్వ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు రాష్ట్ర స్థాయి కబడ్డీ స్కూల్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. గురువారం ఎంపికైన విద్యార్థులను విద్యా కుటుంబం అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం ఎన్‌వి శ్రీ్ధర్ మాట్లాడుతూ ఈనెల 19, 20 తేదీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన అండర్-14 బాలికల కబడ్డీ సెలక్షన్స్‌లో పాఠశాలకు చెందిన డి తేజశివ, వి రాజేశ్వరి, కె ప్రసన్న, యం శివనాగవౌనిక ఎంపికయ్యారు. వీరు అక్టోబర్ 7, 8, 9 తేదీలలో చిత్తూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే ఉయ్యూరులో జరిగిన కబడ్డీ స్కూల్ గేమ్స్ సెలక్షన్స్‌లో ఈ పాఠశాలకు చెందిన వి లేఖన, బి రాజేశ్వరి, డి జానకిరామయ్యలు ఎంపికయ్యారు. వీరు నెల్లూరులో జరగనున్న కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు హెచ్‌ఎం తెలిపారు. ఈ సమావేశంలో పిడి మాదివాడ శ్రీనివాస పెరుమాళ్లు, పిఇటి వేముల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలు విధిగా స్వచ్ఛత పాటించాలి
నాగాయలంక, సెప్టెంబర్ 21: డ్వాక్రా సంఘాలలోని మహిళా సభ్యులు తమ తమ నివాస గృహాల వద్ద స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత పాటించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా రిసోర్స్‌పర్సన్ మార్కండేశ్వరరావు కోరారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్‌పర్సన్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తమతమ ఆవాసాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మహిళలు ఇకపై ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించరాదని, అక్టోబర్ 15వ తేదీ నాటికి నాగాయలంక స్వచ్ఛ గ్రామంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పాటించని డ్వాక్రా మహిళలను ఆయా సంఘాల నుంచి తొలగించటం జరుగుతుందని మార్కండేయరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కెఎల్‌ఆర్‌కె ప్రసాద్, సర్పంచ్ శీలి రాము, కార్యదర్శి కె త్రిపుర సుందరి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

బందరు ఆర్డీవో సాయిబాబు బదిలీ
* నూతన ఆర్డీవోగా ఉదయ భాస్కరరావు నియామకం

మచిలీపట్నం, సెప్టెంబర్ 21: బందరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి సాయిబాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జె ఉదయ భాస్కరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దినేష్ కుమార్ గురువారం జివో నెం.2226ను జారీ చేశారు. నాలుగున్నర సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం ఆర్డీవోగా పని చేసిన సాయిబాబును ప్రకాశం జిల్లా ఒంగోలు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ (్భసేకరణ)గా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ (్భసేకరణ) జె ఉదయ భాస్కరరావును బందరు ఆర్డీవోగా నియమించారు. 2011 బ్యాచ్‌కు చెందిన భాస్కరరావు నెల్లూరు ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా, ఒంగోలు సివిల్ సప్లయిస్ డెప్యూటీ మేనేజర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్డీవోగా పని చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ బందరు ఆర్డీవోగా బదిలీ అయ్యారు. బందరు ఆర్డీవోగా సాయిబాబు గత 2013 ఏప్రిల్ నెలలో బాధ్యతలు స్వీకరించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు 2015 ఆగస్టులో జారీ చేసిన బందరు ఓడరేవు భూసేకరణ నోటిఫికేషన్‌లో కీలక పాత్ర పోషించారు. సుమారు 14వేల ఎకరాల భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి ఔరా అనిపించారు. అలాగే పోర్టు నిర్మాణానికి అవసరమైన 3వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల సమీకరణలో కూడా కీలక పాత్ర పోషించి కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. అలాగే నాగాయలంక మండలం గుల్లలమోదలో ఏర్పాటు చేయనున్న క్షిపణి కేంద్రంకు అవసరమైన భూముల అప్పగింతలో కూడా సాయిబాబు కృషి చేశారు. కృష్ణా పుష్కరాల్లో కూడా సమర్ధవంతమైన సేవలు అందించి జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు.