కృష్ణ

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(స్పోర్ట్స్), సెప్టెంబర్ 22: ఇండియా-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు క్రికెట్ మైదానంలో శనివారం నుంచి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఇరు జట్లు ప్రాక్టీస్ చేశాయి. గత ఏడాది చివరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెస్ట్‌ండీస్ మహిళా జట్టుతో మూడు వనే్డలు, మూడు టి 20 మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించిన విషయం విదితమే. దీంతో ఇండియా-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య ఏకంగా రెండు టెస్ట్ (్ఫర్‌డేస్) మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం విశేషం. టీమిండియాలోకి రానున్న యువ క్రికెటర్లతో ఆడే ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు, యువతకు సరదా పండుగే అని చెప్పవచ్చు. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఉదయం 8.45కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లకు పోలీసుశాఖ పూర్తి భద్రత కల్పిస్తోంది. శుక్రవారం మైదానం మొత్తం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎసిఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్, మీడియా మేనేజర్ సిఆర్ మోహన్, జిల్లా కార్యదర్శి ఎ ఎల్లారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇరు జట్ల కెప్టెన్లు, మేనేజర్లు పిచ్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.
సిరీస్‌ను తేలికగా తీసుకోం: ఇండియా-ఎ కెప్టెన్ కరుణ్‌నాయర్
న్యూజిలాండ్-ఎ జట్టుతో జరిగే సిరీస్‌ను తేలికగా తీసుకోం. సౌత్ ఆఫ్రికా పర్యటన తరువాత భారత జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. చక్కని బ్యాటింగ్ లైనప్, పటిష్టమైన బౌలింగ్‌తో జట్టు సమతుల్యంగా ఉంది. ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్, ప్రతి ఇన్నింగ్స్ కీలకమే. మ్యాచ్‌లు గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. మూలపాడు మైదానం చాలా బాగుంది. చక్కటి ఔట్‌ఫీల్డ్‌తోపాటు పిచ్ కూడా చాలా బాగుంది.
భారత్‌ను నిలువరిస్తాం: న్యూజిలాండ్ కెప్టెన్ హెన్రీ నిక్లోస్
ఇండియా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బాగుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ తరువాత భారతజట్టులో ఆటగాళ్లు మంచి ఉత్సాహంతో ఉన్నారు. సిరీస్ గెలిచేందుకు గట్టి పోటీ ఇస్తాం. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ మాది కూడా బాగుంది. బంతి వేగంగా బ్యాట్‌పైకి వస్తోంది. ఔట్‌ఫీల్డ్, పిచ్ చాలా బాగున్నాయి. చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది.
ఐజిఎంసిలో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అవకాశం లేదు
భారత క్రికెట్ మండలి (బిసిసిఐ) మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయం. ఇంతకుముందు వెస్ట్‌ండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించడంతో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లకు బిసిసిఐ అవకాశం ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మ్యాచ్‌లకు అవకాశం లేదు. ఆరు నెలలు పాటు స్టేడియంను అప్పగించడంతో పాటు కనీసం రూ.50 కోట్లు ఖర్చుపెడితే మినహా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు నిర్వహించలేం. మంగళగిరిలో 23 ఎకరాల్లో అడ్వాన్స్‌డ్ అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది. 2019-20 క్రికెట్ సీజన్ నాటికి ఐపిఎల్ మ్యాచ్‌లు మంగళగిరి స్టేడియంలో జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఎసిఎ పధాన కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు.