కృష్ణ

బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 22: శ్రీ చక్రంలో ఆది దేవతగా భాసిల్లే బాలాత్రిపుర సుందరీ దేవిని దర్శించుకొంటే పూర్ణ ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. చిరునవ్వురు రువ్వుతూ ఆభయహస్తంతో భక్తులకు దివ్య అశీస్సులను అందించే శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంతో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటానికి వేకువ జామునుండే భక్తులు అధిక సంఖ్యలోతరలి వచ్చారు. మహిమాన్వితమైన అలంకారంతో ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం శుక్రవారం భక్తులు క్యూమార్గాల్లో బారులు తీరారు. అమ్మవార్లకు సుప్రభాత సేవ నిర్వహించిన తర్వాత భక్తులను అమ్మవారి దర్శనం కోసం ఆలయాధికారులు అనుమతించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కెనాల్‌రోడ్ వినాయకుని గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలో ప్రవేశించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. వేకువజామున 5గంటల సమయంలో రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులు సుమారు గంట సమయంలోనే అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం సందర్భంగా వేకువ జామునే అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించు కున్నారు. ఉదయం 8 గంటల నుండి క్యూమార్గాల్లో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ సంఖ్య మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. తర్వాత సాయంత్రం 3గంటలనుండి రాత్రి 10గంటల వరకు ఈభక్తుల రద్దీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. కెనాల్‌రోడ్ వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోనికి చేరుకున్న భక్తుల రద్దీని రథం సెంటర్, అశోక్ స్తంభం, ఘాట్‌రోడ్ మెయిన్‌గేట్ పాయింట్ల వద్ద పోలీసులు నియంత్రించారు. కొండపై ఉన్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కొండపైకి అనుమతించారు. క్యూ మార్గంలో భక్తులకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉచితంగా పలు రూపాల్లో సేవలు అందించారు. హెల్ప్‌వింగ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా ఘాట్‌రోడ్ క్యూమార్గంలో పాలు అందించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తిరిగి శివాలయం మెట్ల మార్గం, శ్రీ మల్లికార్జున మహామండపం, తదితర మెట్ల మార్గం గుండా కిందకు చేరుకున్నారు. శ్రీ కనకదుర్గ నగర్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలను కొనుగోలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ కాకుళం జిల్లాకు చెందిన వారు అధిక సంఖ్యలో అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించారు. శుక్రవారం అమ్మవార్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావటంతో భవానీ దీక్షలు స్వీకరించినట్లు వారు వివరించారు. తొలుత వీరు కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారి సన్నిధిలో 52 వేల మంది భక్తులు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 22: దసరా మహోత్సవాల సందర్భంగా 2వరోజు శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను 52,079 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో ఎ సూర్యకుమారి చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్‌లో విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మను ఉచిత దర్శన మార్గంలో 44,702 మంది, రూ.300ల ప్రత్యేక దర్శన మార్గంలో 2,807 మంది, రూ.100ల మార్గంలో 4,570 మంది భక్తులు దర్శనం చేసుకున్నారన్నారు. 54,500 లడ్డూలు, 27,400 పులిహోర పొట్లాలను భక్తులు కొనుగోలు చేశారన్నారు. 10,436 మంది భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొన్నారన్నారు. ప్రతిరోజు రాత్రి 11 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందని ఈవో సూర్యకుమారి తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, పిల్లలకు, వృద్ధులకు ఉచితంగా వేడి పాలు అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం 3 చక్రాల సైకిళ్లను ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచుతామని తెలిపారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తక్షణం పరిష్కరిస్తామన్నారు. రాత్రి 7 గంటల తరువాత రద్దీ పెరుగుతోందని చెప్పారు. 11 గంటల తరువాత దర్శన ఉపసంహరణ చర్యలు ప్రారంభమవుతాయని అందువల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు రాత్రి 10 గంటల లోగా క్యూలైన్లలోకి రావాలని ఆమె తెలిపారు.

3, 4న ఉపరాష్టప్రతి వెంకయ్య పర్యటన

విజయవాడ, సెప్టెంబర్ 22: వచ్చే నెల 3, 4న భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు తన క్యాంపు కార్యాలయంలో ఉప రాష్టప్రతి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆడిటోరియంలో రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారని తెలిపారు. ఆత్కూరు గ్రామంలో కెనాల్ బండ్, ట్యాంక్ బండ్ సుందరీకరణలతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల ఆటస్థలం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ఈ పనులన్నీ ఉప రాష్టప్రతి పరిశీలించే అవకాశం ఉన్నందున ఆయా శాఖాధికారులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నగర పాలక సంస్థ కమిషనర్ జె నివాస్, డిసిపి కాంతిరాణా, జెసి-2 మార్కండేయులు, ఇన్‌ఛార్జి డిఆర్వో సిహెచ్ రంగయ్య, విజయవాడ ఆర్డీఓ ఎస్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.