కృష్ణ

కరకట్టపై హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 22: కృష్ణానది ఎడమ కరకట్ట రోడ్డు అచ్చం అడవిలో రహదారులను గుర్తుకు తెస్తోంది. వేసవిలో మోడువారిన చెట్లు, మొక్కలు వర్షకాలం రావటంతో జీవం పోసుకుని ఏపుగా పెరుగుతున్నాయి. పచ్చని అందాలు కనువిందు చేయటమే కాకుండా వివిధ రకాల మొక్కలు సువాసనలు వెదజల్లుతూ ప్రయాణికులను మైమరపిస్తున్నాయి. వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి గ్రామాల మధ్య ఎక్కువగా వేపచెట్లు దట్టంగా పెరిగాయి. వీటిమధ్య అనేక రకాల ఔషధ మొక్కలు పెరిగి సువాసనలు ఇస్తున్నాయి. అవనిగడ్డ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు, ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించే వారు మంచి అనుభూతిని పొందుతున్నారు. అలాగే ఉదయం పూట అనేక మంది వాకింగ్ చేస్తు మానసికంగా రిలీఫ్ పొందుతున్నారు.

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
మచిలీపట్నం (లీగల్), సెప్టెంబర్ 22: గత తొమ్మిదేళ్ల క్రితం బందరు శివారు రాడార్ కేంద్రం సమీపంలో జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడింది. పెదకరగ్రహారం గ్రామానికి చెందిన మోతుకూరి కృష్ణప్రసాద్ (55) 2008వ సంవత్సరం జూన్ 16వతేదీ రాత్రి 9గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యాడు. సాక్ష్యాసాక్షాలను పరిశీలించిన ఆరవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి మల్లిఖార్జునరావు నిందితులైన బోలెం ఏడుకొండలు(34), మట్టా ఈశ్వరరావు(37), బొల్లా ఈశ్వరరావు అలియాస్ చిన్న (43), నావుడు శివ నందికేశవరావు అలియాస్ రిక్షా శివ (32)లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున జరిమానా విధించారు. ఐదవ నిందితుడిగా పేర్కొన్న పడమట నాంచారయ్యకు సాక్ష్యాలను మాఫీ చేయడానికి ప్రయత్నించిన నేరం కింద మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం హతుడు కృష్ణప్రసాద్ బందరు మండలం కరగ్రహారానికి చెందిన వ్యక్తి. మొదటి ముగ్గురు నిందితులు కూడా ఇదే గ్రామానికి చెందిన వారు కాగా నేరం జరగటానికి కొన్ని నెలల క్రితం హతుడు కృష్ణప్రసాద్ ఆరుసెంట్ల భూమిని బోలెం నాంచారయ్య వద్ద కొనుగోలు చేసి వేరే వారి పేరున రిజిస్టర్ చేయించారు. ఈ భూమికి సరిహద్దుగా ఉన్న తొమ్మిది సెంట్ల భూమిని మొదటి ముగ్గురు నిందితులు కొన్నారు. ఈ భూముల విషయంలో సరిహద్దు వివాదాలు ఏర్పడ్డాయి. ఈ వివాదాలను పురస్కరించుకుని 2008 జూన్ 16వ తేదీ రాత్రి 9గంటల ప్రాంతంలో మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతున్న కృష్ణప్రసాద్‌పై మొదటి నలుగురు నిందితులు మారణాయుధాలతో దాడి చేసి హత్యచేశారు. ప్రత్యక్ష సాక్షి అయిన హతుడు కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ప్రాసిక్యూషన్ తరపున 17 మంది సాక్షులను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పుప్పాల సూరిబాబు విచారించారు. సాక్షాధారాలను పరిశీలించి పైన తెలిపిన శిక్షను న్యాయమూర్తి విధించారు.