కృష్ణ

వచ్చే ఎన్నికల్లో నన్ను ఓడిస్తే రాష్ట్రం వదిలి పోతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 22: వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో నన్ను ఓడిస్తే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతానని, ఈ సవాల్‌ను స్వీకరించే దమ్మున్న టిడిపి నేత ముందుకు రావాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాష్ట్ర పార్టీని, డబ్బును దింపి తనను ఓడించే సత్తా ఎవరికీ లేదన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక శరత్ థియేటర్లో ఎమ్మెల్యే కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. వరుస ఓటమిలు చవిచూస్తున్న రావి గుడివాడలో చేసేది ఏమీలేదని, అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి తనపై ఆరోపణలు చేయడం ఆనవాయతీగా మారిపోయిందన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎవరెలాంటి వారో తెలుసన్నారు. వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో 10వేల మంది యువతతో జగన్ యువసేనను నిర్మిస్తానన్నారు. వైసీపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు చేయడం కన్నా వాటిపై దర్యాప్తు ఎందుకు జరిపించలేక పోతున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, వైసీపి పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, యూత్ అధ్యక్షుడు లోయ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సాగునీరు లేక బీటలువారుతున్న వ్యవసాయ భూములు
అవనిగడ్డ, సెప్టెంబర్ 22: దివిసీమలోని తీరప్రాంత గ్రామాల్లో భూములకు సాగునీరు అందక బీటలువారుతున్నాయి. నాట్లు వేసిన తరువాత కాలువల ద్వారా సాగునీరు అందక చాలా పొలాలు నీరు లేకపోవటంతో ఈ దుస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేయకపోవటంతో బీడుగా దర్శనమిస్తున్నాయి. రైతులు కేవలం వర్షంపై ఆధారపడి నాట్లు వేసుకున్న ఈ పరిస్థితులలో గత పది రోజుల నుండి వేసవి తలపించే ఎండలకు తీర ప్రాంతాలకు సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను చూసి అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్లు ద్వారా పెట్టుకుందామన్నా అందని పరిస్థితి ఏర్పడింది. నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి తీర ప్రాంతాల గ్రామాలకు సాగునీరు సరఫరా చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని రైతులు కోరుతున్నారు. గతంలో ఇదే తరహా సమస్య తీర ప్రాంత గ్రామాలకు సంభవించేది. తిరిగి ఇదే సమస్య పునరావృతం కావటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.