కృష్ణ

ఏలూరు కాలువకు నీరువిడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, సెప్టెంబరు 22: ఏలూరుకాలువకు నీరువిడుదల చేయాలని కోరుతూ మచిలీపట్నం-కల్లూరు ప్రధాన రహదారిపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.బాపులపాడు మండలం పెరికీడు గ్రామం వద్ద ఏలూరుకాలువ వంతెనపై నిర్వహించిన ఈధర్నాకు వైసిపి గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. దీంతో ఈరహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ధర్నా కొనసాగిస్తామని దుట్టా స్పష్టంచేయడంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు అయన్ను అరెస్టు చేశారు. ధర్నాలో దుట్టా మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటికి అధికప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నా రాష్ట్రప్రభుత్వం ఏలూరు కాలువకు నీటి సరఫరాను ఎందుకు నిలిపివేసిందో చేప్పాలని డిమాండ్ చేశారు. వరిపంట పొట్ట దశలోవుందని, ఈసమయంలో పంటకు నీరు అందకపోతే ఇప్పటివరకు రైతన్నలు పడిన కష్టం వృధాగా పోతుందని దుట్టా అవేదన వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలో రైతులకు నీరు అవసరం వున్నా లేకున్నా విడుదల చేస్తున్న మంత్రి దేవినేని ఉమాకు ఏలూరు కాలువ రైతుల సమస్యలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. న్యాయం కోసం రైతుల తరపున శాంతియుతంగా పోరాటం చేస్తున్న తనను అరెస్టు చేయడం దారుణమని దుట్టా వాఖ్యానించారు. ఈ ధర్నాలో పలువురు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏలూరుకాలువ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

కోడూరు మండల తీర గ్రామాల్లో
నీరందక ఎండిపోతున్న వరి పొలాలు
నాగాయలంక, సెప్టెంబర్ 22: పులిగడ్డ క్యాంప్‌బెల్ ఆక్విడక్టు పరిధిలోగల తూర్పు ప్రధాన పంట కాలువ పరీవాహక ప్రాంతంలో ఉన్న కోడూరు మండల తీర గ్రామాలలో గత కొన్ని రోజులుగా సాగునీటి ఎద్దడి ఏర్పడటంతో శుక్రవారం జనసేన పార్టీ నేత రాయపూడి వేణుగోపాలరావు ఆయా ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రాయపూడి విలేఖర్లతో మాట్లాడుతూ కోడూరు మండలంలోని మందపాకల, రామకృష్ణాపురం, ఇరాలి వంటి తీర గ్రామాలలో వేలాది ఎకరాల వరి పైరు నీరు అందక వెలవెలబోతోందని వాపోయారు. సార్వా సాగుకు అవసరమైన నీటిని కాలువ చివరి భూములకు అందిస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు ఏ విధమైన సమాధానం చెప్పగలదని ప్రశ్నించారు. ఈ సంవత్సరం సార్వా వరి నారుమడులు పోసుకొను సమయం నుంచి పంట కాలువలో పూర్తి స్థాయిలో నీటి మట్టం లేకపోవటంతో రైతులు వ్యయప్రయాసలకోర్చి ఆయిల్ ఇంజన్ల సహాయంతో సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా దివి దక్షిణ ప్రధాన పంట కాలువ పరీవాహక ప్రాంతంలో నాగాయలంక మండలంలోని తీర గ్రామాలలో కూడా సాగునీరు అందక వేలాది ఎకరాలు ఎండిపోయే దుస్థితి ఏర్పడింది.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 22: శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన శుక్రవారం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువారం రాత్రి గుడివాడకు చెందిన సరస్వతి నాట్యమండలి వారి మహావీర చంద్రశేఖర్ అనే జానపద నాటక ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చంద్రుడుగా వేముల సూరిబాబు, రుద్రబైరవుడుగా వి మాణిక్యాలరావు, మర్తాండ వర్మగా వి సుబ్బారావు, మణికందరుడుగా దుర్గారావు, స్వర్ణదీపికగా సాయి కుమారి పాత్రోచిత న్యాయం చేశారు. అనంతరం గుడివాడ జైశ్రీ నాట్య మండలి వారిచే భక్తచింతామణి పౌరాణిక నాటక ప్రదర్శన భక్తులను రంజింప చేసింది. బిల్వమంగళుడుగా వి సూరిబాబు, భవానీ శంకరుడుగా జి సురేంద్ర, చింతామణిగా లక్ష్మీశ్రీ, సుబ్బిశెట్టిగా శ్రీనుబాబు, శ్రీహరిగా కొడాలి రాజా పాత్రోచిత న్యాయం చేశారు.

త్తరచిరువోలులంకలో
వికలాంగ రైతు ఆత్మహత్య
అవనిగడ్డ, సెప్టెంబర్ 22: స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోని ఉత్తరచిరువోల్లంక గ్రామానికి చెందిన వికలాంగ రైతు పీతా నారాయణరావు(38) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పురుగుల మందు తాగిన నారాయణరావు ఇంటికి రాగా గమనించిన బంధువులు అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ నారాయణరావు మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ నాగేంద్రరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొవ్వ పిహెచ్‌సికి మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
కూచిపూడి, సెప్టెంబర్ 22: మండల కేంద్రం మొవ్వ పిహెచ్‌సికి మరమ్మతులు చేపట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పామర్రు నియోజకవర్గ సిపిఎం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు పర్యవేక్షణలో శుక్రవారం రోగులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి వైద్యుడు డా. శొంఠి శివరామకృష్ణ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ 24గంటల ప్రసూతి కేంద్రమైన ఈ పిహెచ్‌సిలో మహిళా వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్, హెడ్ నర్సు, ఫార్మాసిస్టు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం శివరామకృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి శీలం ప్రకాశరావు, రైతు సంఘం నాయుకులు కూరపాటి కృష్ణమూర్తి, వీర్ల ప్రసాద్, సిహెచ్ సుధా తదితరులు పాల్గొన్నారు.