కృష్ణ

దుర్గమ్మను దర్శించుకున్న 62వేల మంది భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 23: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని 62,500 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఇవో ఎ సూర్యకుమారి చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మీడియా పాయింట్ నుండి శనివారం సాయంత్రం విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ శ్రీ గాయత్రీదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు కనులవిందుగా దర్శనమిచ్చారని, 55వేల మంది భక్తులు ఉచిత దర్శనం ద్వారా అమ్మవారిని సేవించారన్నారు. రూ. 300 టికెట్ ద్వారా 3386, రూ. 100 టికెట్ ద్వారా 4,154 మంది అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. దుర్గమ్మ అమ్మవారిని వయోవృద్ధులు, మానసిక దివ్యాంగులు 3,200 మంది శనివారం దర్శించుకున్నారన్నారు. 47,680 లడ్డూలు, 23,200 మందికి పులిహోర ప్యాకెట్లు భక్తులు కొనుగోలు చేశారన్నారు. 900 కేజీల అన్న ప్రసాదాన్ని 8,834 మందికి అందించామని ఆమె చెప్పారు. ఉచిత వైద్యశిబిరాల ద్వారా 3,095 మంది భక్తులకు వైద్య సేవలు అందించామన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మరథ పూర్వకంగా వివిధ మంగళ వాయిద్యాలతో, భజనకోలాట, సంప్రదాయ కేరళ నయాండా, బళ్లారి వాయిద్యాలతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల అపూర్వ నగరోత్సవం జరుగుతుందని సూర్యకుమారి వివరించారు.

వృద్ధుల కోసం కొండపైకి మరిన్ని బస్సులు
* దుర్గగుడి ఇవో సూర్యకుమారి వెల్లడి
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 23: వృద్ధులను, దివ్యాంగులను ఇంద్రకీలాద్రిపైకి తీసుకురావడానికి మరిన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఇదే ప్రాంతంలో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్య నిర్వాహణాధికారిణి ఎ సూర్యకుమారి తెలిపారు. మూడో రోజు శనివారం తలనీలాలు సమర్పించే కేంద్రాన్ని, ఉచిత బస్సుల కేంద్రాన్ని, అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఇవో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన దైవ దర్శనం కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల్లో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే బాలింతలు, గర్భిణుల కోసం శనిశ్వరాలయం వద్ద బస్సులను ఏర్పాటు చేశామన్నారు. కేశ ఖండనశాల ప్రాంగణంలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు పూర్తి స్థాయిలో క్షురకులను తగిన స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. రూ. 15తో భక్తులు అమ్మవారికి తలనీనాలు సమర్పిచుకోవచ్చునని, కేటాయించిన టికెట్ విక్రయ కేంద్రాల్లో టికెట్లు కొనుగోలు చేయాలని ఎటువంటి అదనపు రుసుమును ఎవ్వరికీ ఇవ్వవద్దని సూర్యకుమారి తెలిపారు. దేవస్థానం అర్జునవీధి ప్రాంతంలో ఉన్న అన్న వితరణ కేంద్రం ద్వారా ప్రతినిత్యం ఉదయం 8.30 గంటల నుండే అన్న ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామని ఆమె తెలిపారు. మంచినీటితోపాటు, పాలును కూడా చిన్నారి పిల్లలకు అందించేందుకు స్వచ్చంద సంస్థలతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మూలనక్షత్రం రోజున ఉదయం 1 గంటల నుండి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని సూర్యకుమారి వివరించారు.

27న దుర్గమ్మ దర్శనానికి సిఎం చంద్రబాబు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 23: ఈ నెల 27న మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారిని దర్శించుకోనున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఎ సూర్యకుమారి తెలిపారు. ఆశ్వయుజ శుద్ధ సప్తమి బుధవారం 7వ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారన్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా పరమైన ఏర్పాట్లను, దర్శన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి జోషి, ఆలయ ఇవో సూర్యకుమారి, డిసిపి టికె రాణా, ఎసిపి రామకృష్ణ, సబ్ కలెక్టర్ హరీష్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.