కృష్ణ

కలిదిండిలో కుండపోత వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, సెప్టెంబర్ 23: మండల కేంద్రం కలిదిండిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండకు అల్లాడిన ప్రజలకు శనివారం సాయంత్రం 5గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కుండపోతగా వర్షం కురవడంతో సేదతీరారు. దీంతో చిరువ్యాపారులు, పండ్ల దుకాణాల వారు ఎక్కడి బండ్లను అక్కడే వదిలేసి తలదాచుకున్నారు. సీతాఫలాలు వర్షానికి తడిసి ముద్దాయ్యాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వర్షం మాత్రం రైతులకు ఎంతో ఉపయోగకరమని భావిస్తున్నారు.

వేదమాతా.. నమోస్తుతే
* శ్రీ గాయ్రతీదేవి అలంకారంతో భక్తులకు దివ్యదర్శనం
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 23: ముక్తా, విద్రుమ, హేమ నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతోదర్శన మిస్తున్న సంధ్యా వందన దేవత శ్రీ గాయత్రీ అలంకారంతో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం శ్రీ కనకదుర్గమ్మ ఈ దివ్యమైన అలంకారంతో భక్తకోటికి దివ్య దర్శనం ఇచ్చింది. గాయత్రీ మంత్రానికి అథిష్ఠాన దేవత సూర్యభగవానుడు కావటంతో శనివారం శ్రీ దివ్యమైన అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సౌరశక్తి ప్రాప్తి కలుగుతోందన్న నమ్మకంతో భక్తులు వేకువజాము నుంచే ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ సకల మంత్ర సిద్ధి ఫలితాన్ని పొందాలని భక్తులు ఆశిస్తూ దర్శనం నిమిత్తం కొండపైకి తరలి వచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారు ఝామున 3గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించి భక్తులను దర్శనం కోసం అనుమతించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కెనాల్‌రోడ్ వినాయకునికి గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గం గుండా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. 5గంటల సమయంలో రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులు సుమారు గంట సమయంలోనే అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 6గంటల నుండి అన్ని క్యూమార్గాల్లో ఉన్న భక్తుల సంఖ్య చాలా తక్కువుగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వలంటీర్లు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 9గంటల నుండి భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ రద్ధీ మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. తిరిగి సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ రాత్రి 10గంటల వరకు కొనసాగింది. రాత్రి 9గంటల నుండి పాతబస్తీకి చెందిన స్థానికులు రాత్రి 9గంటల నుండి ఆలయానికి రావటం కనిపించింది. కెనాల్‌రోడ్ వద్ద ప్రారంభమైన ఈక్యూమార్గంలోనికి చేరుకున్న భక్తులను పోలీసులు రథం సెంటర్, అశోక్ స్థంభం, ఘాట్‌రోడ్ మెయిన్ గేట్, తదితర పాయింట్‌ల వద్ద భక్తులను రద్ధీని నియంత్రిస్తూ కొండపైనున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కొండపైకి అనుమతించారు. శనివారం ఉదయం ఉచిత దర్శనం చేసుకున్న భక్తులకు సుమారు 3గంటల సమయం పట్టింది. క్యూమార్గంలో భక్తులకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉచితంగా పలు రూపాల్లో సేవలు అందించారు. దర్శనం భక్తులు తిరిగి శివాలయం మెట్ల మార్గం, శ్రీ మల్లిఖార్జున మహామండపం, తదితర మెట్ల మార్గం గుండా కిందకు చేరుకున్నారు. శ్రీ కనకదుర్గ నగర్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రత్యేక ప్రసాదాలను కొనుగోలు చేసిన తర్వాత ఎదుట ఉన్న దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన ప్రసాదాన్ని ఉదయం 8.30గంటల నుండే ఆలయాధికారులు అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు అనుమతించారు.