కృష్ణ

దేశ ఐక్యతను చాటే స్వచ్ఛ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, సెప్టెంబర్ 23: దేశ ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను చాటేందుకు స్వచ్ఛ భారత్ ఉపకరిస్తుందని ఆంధ్రప్రదేశ్ టెలికం శాక ఛీప్ జనరల్ మేనేజర్ కె.దామోదర్ రావు అభిప్రాయపడ్డారు. శనివారం దూరవాణి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలో స్వచ్ఛసేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి, మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలలో సామాజిక బాధ్యత పెరుగుతుందని, అందరూ క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టెలికం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజారులో జరిగిన స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, కమిషనర్ శేఖరరావు, పలువురు కౌన్సిలర్‌లు, రైతు బజారు వ్యాపారస్థులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రైతు బజారును శుభ్రపరిచారు.

డిఇఓ కార్యాలయం ఎదుట నాన్ టీచింగ్ స్ట్ఫా ధర్నా
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 23: ఏకీకృత సర్వీస్ రూల్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, తమ పదోన్నతులకు విఘాతం కల్పించే జివో నెం.73ను రద్దు చేయాలని ది స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్ట్ఫా శనివారం డిఇఓ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 29వతేదీ వరకు పలు రూపాల్లో ఆందోళన నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, యువి సుబ్బారావు తెలిపారు. గతంలో సుప్రీం కోర్టు కొట్టివేసిన జివో నెం.73ను మళ్లీ పునరుద్ధరించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రాజకీయ నాయకుల అండదండలతో ఈ జివోను రాత్రికి రాత్రికి విడుదల చేయించారని ఆరోపించారు. జివో నెం.73 వల్ల నాన్ టీచింగ్ స్ట్ఫాకు పదోన్నతుల విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎంతటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

హత్య కేసులో నిందితులు అరెస్టు
కలిదిండి, సెప్టెంబర్ 23: నేరస్థునికి ఆశ్రయమిచ్చినా, సహకరించినా నేరస్థునితోనే సమానమని కైకలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ అన్నారు. ఆగస్టు 1వ తేదీ రాత్రి పాము నాగబాబు (28)ను పాము రామయ్య (29) హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం రాత్రి పడమటిపాలెం బస్టాండు వద్ద నిందితులు పాము రామయ్య, పరసా రాజేష్, పాము దుర్గారావులను అరెస్టు చేసినట్లు సిఐ రవికుమార్ తెలిపారు. మరో వ్యక్తి బస్వాని రాంబాబును ముందుగానే అరెస్టు చేశామన్నారు. హత్య చేసిన రామయ్య భీమవరంలో ఉన్న బస్వాని రాంబాబు వద్దకు వెళ్లి నాలుగు రోజులు తలదాచుకుని జరిగిన విషయం వివరించాడు. అక్కడ రక్తపు బట్టలను, బైక్‌ను విడిచి అక్కడి నుంచి వైజాగ్ వెళ్లి సింహాచలంలో ఎవ్వరూ గుర్తుపట్టకుండా గుండు చేయించుకున్నాడు. తరువాత హైదరాబాద్‌లోని తమ్ముడు వరుస అయిన పాము దుర్గారావు వద్దకు వెళ్లాడు. దుర్గారావును తరచూ పడమటిపాలెం పంపించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాడు. చివరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి జల్లెడపట్టి ఇంటిలిజెన్స్ వారి సహాయంతో అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. పరసా రాజేష్, పాము రామయ్య కలిసి చేపల వ్యాపారం, కోడి పందాల ఆటల్లో పరిచయం ఉంది. మృతుడు పాము నాగబాబుకు పాము రామయ్యకు ఒకటిన్నరసెంట్ల భూమి వివాదం ఉంది.
మృతుడు పాము నాగబాబు పాము రామయ్యతో శ్రీరామనవమి రోజున తలెత్తిన గొడవతో పగబట్టిన రామయ్య రాజేష్‌తో కలిసి ఆగస్టు 1న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంతంలో జాతీయ రహదారిపై నాగబాబు బైక్‌ను అడ్డగించి కోడి కత్తితో హత్య చేశారు. నేరస్థుడికి ఆశ్రయం కల్పించిన, సహకరించిన పాము దుర్గారావు, బస్వాని రాంబాబు, పాము రాజేష్, పాము రామయ్యలను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చారు. అరెస్టుకు కైకలూరు ఎస్‌ఐ రంజిత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ రజిని కుమార్, మస్తాన్, సత్యనారాయణ, ప్రసాద్ సహకరించారు.

ఇంటింటికి తెలుగుదేశంను విజయవంతం చేయాలి
బంటుమిల్లి, సెప్టెంబర్ 23: ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెడన నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు, ఎమ్మెల్యే కాగిత తనయుడు కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలంలో ఈనెల 25, 26, 27 తేదీలలో అక్టోబర్ 11, 12, 25, 26, 27 తేదీలలో మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. శనివారం స్థానిక నాగేశ్వరరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు ఇల్లూరి లీలాకృష్ణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మరలా చంద్రబాబు నాయుడునే సిఎంగా చేసేందుకు ప్రతి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఆత్మకమిటీ చైర్మన్ ఓవైవి చలం, మండల పార్టీ అధ్యక్షుడు ఇల్లూరి లీలాకృష్ణ, రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ బొల్లా వెంకన్న తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు సరిగా పని చేయటం లేదని, అవుసింగ్ బిల్లులు రావటం లేదని, గృహ నిర్మాణానికి అధికారులు పీసిలు ఇవ్వటం లేదని, సమస్యలు ఇలా ఉంటే ప్రజలలోకి ఎలా వెళ్ళతామని వాపోయారు. ఈ కార్యక్రమంలో గౌరీశంకర్, కాగిత అమర్‌నాధ్, కంఠమనేని మురళీకృష్ణ, వైస్ ఎంపిపి వెంకట రాజారావు తదితరులు పాల్గొన్నారు.