కృష్ణ

చింతలపూడి ఎత్తిపోతలతో మెట్టప్రాంతానికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 24: రాష్ట్రం పీకలలోతు అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మెట్ట రైతులను కాపాడే ఉద్దేశ్యంతో సుమారు నాలుగువేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని, ఈపథకం అమలుతో మెట్ట ప్రాంతానికి మహర్దశ పట్టనుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మైలవరం ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు లోటు లేకుండా ఇవ్వాలని ఆదేశించారు. వైద్య సేవల అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. రోగులకు, బాలింతలకు, గర్భిణులకు సరైన సేవలందించాలన్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం అమలు యుద్ధప్రాతిపదికన జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో దాదాపు 40 ప్రాజెక్టుల నిర్మాణం పరుగులు పెడుతున్నాయన్నారు. ఇవి పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందన్నారు. అనేక ఒడిదుడుకులను తట్టుకుని రాయలసీమకు నీరందిస్తున్న ఘనత తమదేనన్నారు. ఇది ఓర్వలేక వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపై తప్పుడు కూతలు కూస్తున్నారన్నారు. వారు చేయలేని పనులు తమ ప్రభుత్వం చేసి చూపుతుందన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే వచ్చే ఎన్నికలలో వైసీపీ దుకాణం సర్దేయటమేనన్నారు. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఉనికి కోసమే ఆ పార్టీ నేతలు నవరత్నాల పేరుతో ఇళ్ళ వెంట దొంగల్లా తిరుగుతున్నారని విమర్శించారు. వారిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యంగా మైలవరంలో తనను ఓడించటానికి అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను మైలవరంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలందిస్తున్నానన్నారు. గ్రామాల్లో పార్టీ నేతలు భేషజాలు విడిచి కలసి పని చేయాలని, గడచిన మూడేళ్ళలో ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధి పనులను ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన పార్టీ శ్రేణులను ఆదేశించారు. తాను గ్రామాలలో తిరగకపోయినా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వారి వారి గ్రామాలలో పర్యటించాలని, తాను ఏదో సందర్భంలో వారితో కలుస్తానని తెలిపారు. ప్రస్తుత వర్షాల సీజన్‌లో పారిశుద్ధ్యంపై పంచాయితీలు శ్రద్ధ వహించాలన్నారు. అంటువ్యాధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మైలవరం పంచాయితీలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే ప్రాంతానికి అవసరమై రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని పంచాయితీరాజ్ డిఈని ఆదేశించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు బుల్లిబాబు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, తాతా పోతురాజు, ఉపసర్పంచ్ షహానాబేగం, సుభాని తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలను విజయవంతం చేయాలి
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 24: స్థానిక హిందూ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం నుండి ఆరు రోజుల పాటు నిర్వహించనున్న 26వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ కుర్రా నరేంద్ర కోరారు. ఆదివారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొననున్నట్లు చె ప్పారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు క్రీడా శాఖ మంత్రి కొల్లు ర వీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, శాసనమండలి సభ్యు డు బచ్చుల అర్జునుడు పోటీలను లాం ఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అమెచ్యూర్ బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో ఎపి బేస్‌బాల్ అసోసియేషన్, జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణకు గాను క్రీడా ప్రాధికార సంస్థ రూ.4లక్షలు, పర్యాటక శాఖ రూ.3లక్షలు నిధులను మం జూరు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షకులుగా అమెచ్యూర్ బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతినిధులు అరుణ్, సిరాజుద్దీన్‌లు నియమితులైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎంవిఎస్ ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దారం నవీన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తోట తులసీరావు, కర్ణాటక బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు, వ్యాయామోపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఆనంద లహరి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 24: స్థానిక కోనేరుసెంటరులో ఆదివారం నిర్వహించిన ఆనందల హరి కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. పట్టణంలోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారతీయ, సంస్కృతి, కళా వైభవాన్ని తెలిపే కూచిపూడి, భరత నాట్యం ప్రదర్శనలతో పాటు జానపద నృత్యాలు విశేషంగా అలరించాయి. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు తదితరులు పాల్గొన్నారు.