కృష్ణ

రైతు బాంధవుడు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, అక్టోబర్ 9: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడుగా నిలుస్తున్నారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం 3వ విడత రైతు రుణమాఫీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీని ప్రకటించటం ద్వారా ముఖ్యమంత్రి దేశంలోనే రైతు బాంధవుడుగా గుర్తింపు పొందారని మండలి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సజ్జా గోపాలకృష్ణ, మండల ప్రత్యేక అధికారి దేవానందరెడ్డి, ఆర్టీఓ పి సాయిబాబు, తహశీల్దార్ స్వర్గం నరసింహారావు, మాజీ ఎఎంసి ర్మన్ మండవ బాలవర్ధిరావు, ఎంపిడిఓ ఎఎల్‌ఆర్‌కె ప్రసాద్, మండల వ్యవసాయశాఖ అధికారి కె రామ సుబ్బారెడ్డి, సర్పంచ్ శీలి రాము, కార్యదర్శి కె త్రిపుర సుందరి, రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల బాగోగులు మీకు పట్టవా..!?
* డిఎంఅండ్‌హెచ్‌ఓ, డిసిహెచ్‌ఎస్‌ను నిలదీసిన కలెక్టర్

మచిలీపట్నం, అక్టోబర్ 9: ప్రభుత్వ ఆస్పత్రుల బాగోగులు మీకు పట్టవా..? ఏ నాడైనా ఆస్పత్రుల తనిఖీలకు వెళ్లారా..? వెళితే సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారు..? కేవలం మీ అసమర్థత వల్ల ప్రభుత్వానికి ఎందుకు చెడ్డపేరు తీసుకువస్తారు..? అంటూ జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్య శాఖాధికారులపై మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై, ఆ శాఖపై వస్తున్న ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. టివిఎస్‌ఎన్ శాస్ర్తీ, డిసిహెచ్‌ఎస్ డా. జోత్యర్మయిలను నిలదీశారు. ఏదైనా సమస్య వస్తే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారే తప్ప దాని పరిష్కారానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ ఇరువురు అధికారులను మందలించారు. నేను కలెక్టర్‌గా వచ్చి ఆరునెలలు అవుతున్నా ఇప్పటి వరకు శాఖాపరంగా అది కావాలి..? ఇది కావాలి..? అని ఒక్క రిప్రజంటేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఇతరత్రా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్న ఆలోచన కూడా మీకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రి రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 9: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 17వ వార్డు బందరుకోట కొత్తకాలనీలో రూ.34లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డుకు మంత్రి రవీంద్ర సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం వంటి కార్యక్రమాలను చేపట్టిన అపర మేథావి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాలనీ వాసుల అభ్యర్థన మేరకు త్వరలోనే పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పి కాశీవిశ్వనాధం, రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం డైరెక్టర్ నారగాని ఆంజనేయప్రసాద్, కౌన్సిలర్లు బచ్చుల అనిల్ కుమార్, బత్తిన దాసు, పార్టీ నాయకులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏటిఎంలో చోరీకి విఫలయత్నం
గుడ్లవల్లేరు, అక్టోబర్ 9: స్థానిక శ్రీ గంగా పార్వతీ సమేత గౌతమేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న ఎస్‌బిఐ బ్యాంక్ వద్ద ఉన్న ఎటిఎంలో ఆదివారం రాత్రి 12.30గంటల సమయంలో మండవ హేమంత్ అనే యువకుడు ఏటియంలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు మద్యం సేవించి ఉండటంతో ఏటియంకు ఉన్న డోరు అద్దాలు, అక్కడే ఉన్న ప్రింటింగ్ మిషన్‌ను ధ్వంసం చేశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివప్రసాద్ ఏటియంను సోమవారం పరిశీలించారు. బ్యాంక్ అధికారులను సంప్రదించారు. ఏటిఎం వద్ద నైట్ సెక్రూటి సిబ్బంది లేకపోవటం గమనార్హం.

ఎన్నికల వాగ్దానాలను అమలు చేస్తున్న సిఎం
* మంత్రి రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 9: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తుచ తప్పకుండా పాటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం స్థానిక 17వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మూడు విడతలుగా రైతు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. నదులను అనుసంధానం చేయటం ద్వారా అపరభగీరధుడుగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పి కాశీవిశ్వనాధం, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు తుపాను షెల్టర్ కూల్చివేత
బంటుమిల్లి, అక్టోబర్ 9: ప్రాథమిక పాఠశాలకు, అంగన్‌వాడి కేంద్రానికి ప్రమాదకరంగా మారిన, శిథిలావస్థకు చేరిన తుపాన్ షెల్టర్‌ను స్పెషల్ ఆఫీసర్ చొరవతో ఎట్టకేలకు నేలమట్టం చేశారు. మండల పరిధిలోని మల్లంపూడి గ్రామంలో శిథిలావస్థకు చేరిన తుపాన్ షెల్టర్ నిరుపయోగంగా ఉంది. దీని పక్కనే పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన తుపాన్ షెల్టర్ ఎప్పుడు పడిపోతుందోన్న ఆందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. శిథిలావస్థకు చేరిన తుపాన్ షెల్టర్‌ను తొలగించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో సార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన అక్షరకృష్ణ డిడి సలీమ్ దృష్టికి సమస్య రావటంతో వెంటనే మాజీ సర్పంచ్ బి భోగేశ్వరావు, గ్రామస్థుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. పడిపోయే స్థితిలో ఉన్న షెల్టర్‌ను కూల్చివేయటం జరిగింది. చొరవ చూపిన సలీమ్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.