కృష్ణ

నవ్వులపాలవుతున్న నూజివీడు పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, అక్టోబర్ 10: జిల్లాలో పలువురు రక్షక భటులే భక్షకులవుతున్నారు. తప్పు చేస్తున్న ప్రజలను గాడిలో పెట్టాల్సిన పోలీసులే దోషులుగా మారుతున్నారు. మేం పోలీసు అధికారులం.. ఏం చేసిన అడిగేవారు లేరు.. మాదే చట్టం అనే రీతిలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. నూజివీడు పోలీసు డివిజన్‌లోని పలువురు ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు వ్యవహారించిన తీరు ఆ శాఖను నవ్వులపాలు చేస్తోంది. గత నాలుగు సంవత్సరాల కాలంలో నూజివీడులో పనిచేసిన ఎస్‌ఐలలో ఎక్కువ మంది పలు ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్‌కు వెళ్లినవారే. ఈ ప్రాంతంలో పోలీసు అధికారుల నిర్వాకాన్ని దృష్టిలో ఉంచుకుని నూజివీడు డివిజన్‌లోని పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని జిల్లా పోలీసు అధికారులు మంగళవారం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా నూజివీడు ఎస్‌ఐ వెంకటకుమార్ వ్యవహరించిన తీరు పోలీసులకు తలనొప్పిగా పరిణమిస్తోంది. వివాహిత మహిళను లైంగికంగా వేధించి, రూమ్‌కు రమ్మన్న నూజివీడు పట్టణ ఎస్‌ఐ వెంకటకుమార్ వ్యవహారం తెరపైకి రావటంతో వెంకటకుమార్ వ్యవహార శైలి, పలు ఆరోపణలు మంగళవారం జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టికి చేరాయి. స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న మహిళ ఆమె భర్తకు చెందిన కేసు విషయమై పోలీసు స్టేషన్‌కు వెళ్లగా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు పట్టణ ఎస్‌ఐ వెంకటకుమార్. తాను అలాంటిదానిని కాదని మొరపెట్టుకున్నప్పటకీ ఎంతకూ వినక పోవటంతో సంభాషణను సెల్‌ఫోన్‌లో రికార్డుచేసి, ఎస్‌పి త్రిపాఠికి ఆమె పంపింది. దీంతో ఈ సంఘటనపై ఎస్‌పి విచారణ ప్రారంభించారు. నూజివీడు ఎస్‌ఐ వెంకటకుమార్‌పై మహిళ నేరుగా వాట్సప్‌లో ఫిర్యాదు చేయటంతో మరిన్ని ఆరోపణలు కూడా ఆయనపై మంగళవారంనాడు పోలీసు ఉన్నతాధికారులకు వెళ్ళినట్లు తెలిసింది. పోలీసు స్టేషన్‌పై షెడ్డు నిర్మాణం విషయంలో కూడా ఎస్‌ఐ వెంకటకుమార్ ఐదు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వెళ్ళాయి. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎస్‌ఐ వెంకటకుమార్‌పై రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో హనుమాన్ జంక్షన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న విజయకుమార్ నూజివీడులోని ఒక బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయాన్ని బ్యూటీపార్లర్ నిర్వాహకురాలి భర్తే నేరుగా ఎస్‌పి త్రిపాఠికి ఆధారాలతో ఫిర్యాదు చేయటంతో వెంటనే విఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రమైన చాట్రాయిలో అక్రమంగా తరలిపోతున్న ఇసుకను స్వాధీనం చేసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు ఇసుకను అమ్ముకున్నారు. ఈ సంఘటన వెలుగులోకి రావటంతో ఎఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.