కృష్ణ

మరో 23 మంది రైతులకు సింగ్‌పూర్ టూర్ ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 10: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సింగ్‌పూర్ పరిశ్రమల మంత్రి ఈశ్వరన్ ప్రతి ఆరు నెలల కొకసారి జరగాల్సిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ (జెఐడబ్ల్యూసి) సమావేశాన్ని ఈ నెల 16, 17వ తేదీలలో జరిపేందుకు సన్నాహాలు చేయాలని సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో సింగ్‌పూర్ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ ఛాంగ్‌తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్న జెడబ్య్లూసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఈశ్వరన్‌ల సమయానుకూలతల మేరకు ఈ సమావేశ నిర్వహణకు కసరత్తు చేయాలన్నారు. రాజధాని అమరావతి నగరంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా మాత్రమే భూకేటాయింపులు చేయడమే కాకుండా వౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతుందని ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్‌కు అథారిటీ ఆమోదం పొందడం అవసరమన్న ఆయన అమరావతి నగరాల్లో రవాణా విధానంపై జీకా సంస్థ జరిపిన సమగ్ర సర్వే వివరాల నివేదికను వచ్చే సమావేశానికి అందజేస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి సమగ్ర రవాణా వ్యవస్థ విధానాన్ని రూపొందించడం జరుగుతుందని, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించే విధంగా సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సిఎల్‌సి) ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రీ ఆఫ్ కాస్ట్ విధానంలో ఇళ్ల నిర్మాణంపై మూడు రోజుల పాటు నిపుణులతో నిర్వహించే శిక్షణకు సిఆర్‌డిఎ, ఎడిసి ఇంజినీరింగ్ అధికారులు పాల్గొనాలని సింగ్‌పూర్ అధికారుల బృందం కోరింది. అదేవిధంగా 2018 జనవరి లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని తీర్మానించారు. రాజధాని నగరాల అభివృద్ధిపై అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులను సింగ్‌పూర్ పర్యటనకు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, తొలుత 100 మందికి టార్గెట్ నిర్ణయించగా మరో 23 రైతులు కూడా సింగ్‌పూర్ పర్యటనకు ఉత్సాహం తెలిపినందున వారికి కూడా తగు అవకాశం కల్పించాలని సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీ్ధర్ అభ్యర్థనకు జెఐడబ్ల్యూసి సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ వి రామమనోహరరావు, అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్, ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ వై నాగిరెడ్డి, ఛీఫ్ ఇంజినీర్ టి అంజనేయులు, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్‌విఆర్‌కె ప్రసాద్, ఎడిసి అధికారి కెవి గణేష్‌బాబు, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ నిపుణులు వాంగ్ కై యెంగ్, డెప్యూటీ డైరెక్టర్ లిమ్ స్వీకెంగ్, బిల్డింగ్ అండ్ కంట్రోల్ అథారిటీ ఇంటర్నేషనల్ మార్కెట్ గ్రూప్ డైరెక్టర్ కోహ్ లిన్ జి, సింగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజ్ సౌత్ ఏసియా డివిజన్ డైరెక్టర్ ఆడ్రీ టాన్, ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎరిక్ టాన్ తదితరులు పాల్గొన్నారు.