కృష్ణ

జిల్లాలో ఇంటింటికీ కుళాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: జిల్లాలోని ప్రతి హేబిషన్‌లో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో రూ. 850 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లు, ఇవోఆర్‌డిలతో వర్కుషాపు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గ్రామీణ ప్రాంతాల వారికి 100 శాతం ఇంటింటా కుళాయి పథకంలో భాగంగా జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక పరమైన అంశాల పట్ల స్థానిక ప్రజాప్రతినిధుల్లో మంచి అవగాహన ఉంటుందని, వారి సలహాలు, సూచనలతో ఈ పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో తొలిదశలో రూ. 850 కోట్లతో అమలు పరుస్తున్నామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ఈ పనులను దశలవారీగా అమలు పర్చనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చేసిన ప్రతిపాదనలను ఈ నెల 12న నగరంలో నిర్వహించ తలపెట్టిన వర్కుషాపులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తెస్తామన్నారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఇంటింటికీ కుళాయి పథకం చేపట్టినట్లు చెప్పారు. ప్రతి మనిషికి ప్రతిరోజూ 70 లీటర్ల నీళ్లు అందించాలనే ఉద్దేశ్యంతో రూ. 850 కోట్లతో ఈ పథకాన్ని అమలుపర్చడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 5,79,238 గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వవలసి ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ఇంటింటా కుళాయి ద్వారా మహిళల కళ్లల్లో వెలుగులు చూడవచ్చన్నారు. గృహిణులకు ఎంతో ప్రాధాన్యమైన ఈ పథకం ద్వారా నీటిని ఇంటికే చేర్చడం ముదావహమన్నారు. బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఆవశ్యకత ఎంతైనా ఉందని, అవసరమైతే భూసేకరణ చేసి పెద్ద చెరువులు తవ్వించి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. పెడన శాసనసభ్యుడు కాగిత వెంకట్రావ్ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల వారికి ప్రత్యేక గ్రిడ్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లోని పారిశుద్ధ్య పనులను ఉపాధి హామీ కూలీలతో అనుసంధానం చేస్తే పారిశుద్ధ్యం మెరుగు పడుతుందని సూచించారు. పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ కృష్ణా రివర్ పైపులైన్ ద్వారా 5 మండలాలకు 108 తాగునీటి హెబిటేషన్లకు గాను రూ. 48 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 5 మండలాల్లో 3 మండలాలకు తాగునీరు అందిస్తున్నామని, మిగతా 2 మండలాల పరిధిలోని హేబిటేషన్లకు ఇంటింటా కుళాయి పథకంలో నిధులు మంజూరు చేయాలని సూచించారు. నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ చాట్రాయి, ముసునూరు లాంటి మండలాల్లో భూగర్భ జలాలు చాలా లోతులో ఉన్నాయని, అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ నీటి వినియోగంపై అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉందని, ఇంటింటికీ కుళాయి పథకం అమలు జరపడం శుభపరిమాణమన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ నియోజకవర్గాల వారీగా ఉన్న ఇళ్లకు కేటాయించవలసిన కుళాయిలు, తదితర అంశాలు ఇంజనీర్లకు వివరించారు.