కృష్ణ

మల్లవల్లిలో రూ.వెయ్యి కోట్లతో అగ్రీ ప్లాస్టిక్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 22: నిత్య జీవనంలో ప్లాస్టిక్ లేకుండా గడపలేమని, నాగరికతలో ప్లాస్టిక్ అంతర్భాగమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్లాస్టిక్ వేస్ట్‌ను సమర్థవంతంగా వినియోగించి ప్రగతిని సాధించాలన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని సూరంపల్లి గ్రామంలో ‘సీపెట్’ భవనాలకు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మల్లవల్లిలో ప్లాస్టిక్ పార్కు స్థాపనకు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. ఇజ్రాయిల్‌ను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బల్క్ డ్రగ్ పార్కును విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు 500 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంస్థల స్థాపనతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సూరంపల్లికి సమీపంలోని చుక్కపల్లి సంస్థ నుండి 5వేల చదరపు గజాల స్థలాన్ని తీసుకునేందుకు, దీన్ని పరిశోధనా రంగానికి వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు చెప్పారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వినియోగంతో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయన్నారు. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అభివృద్ధితో లక్ష మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మరో కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. దేశంలో 4.5 లక్షల మంది ప్లాస్టిక్ టెక్నీషియన్లు అవసరం కాగా ప్రస్తుతం 65వేల మంది మాత్రమే ఉన్నారన్నారు. ఈ సంఖ్యను పెంచేందుకు 10 లక్షల మంది టెక్నీషియన్లను తయారుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వాన కృషి చేస్తున్నట్లు వివరించారు. గత 35ఏళ్లలో 23 సీపెట్‌లు స్థాపించగా కేవలం రెండేళ్లలో తాము 15 ఏర్పాటు చేసి వాటి సంఖ్యను 38 చేసిన ఘనత సాధించామన్నారు. విజయవాడలో 300 మందితో ప్రారంభించి 3 వేలు, 5 వేల మంది టెక్నీషియన్లను తయారు చేస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడలలో స్టీలు, సిమెంటు, బాక్సైట్ రంగాల్లో ప్లాస్టిక్ వినియోగంతో అభివృద్ధిని సాధిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ హబ్‌గా తయారు చేసేందుకు అనంతపూర్‌లో మరో సీపెట్‌ను ఏర్పాటు చేస్తామని అనంతకుమార్ ప్రకటించారు. 250 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఎపిలో స్థాపించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. 100 సీపెట్ కేంద్రాలను దేశంలో ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా రీసైకిల్ చేసి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడతామన్నారు. వ్యవసాయ రంగానికి ప్లాస్టిక్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ పట్టిసీమ కాల్వ తవ్వడం ద్వారా గన్నవరం ప్రాంతంలో 20 వేల ఎకరాల్లో రైతులు అపరాలు సాగు చేసి ఆర్థికంగా లబ్ధిపొందారని చెప్పారు. ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో సీపెట్ సంస్థను స్థాపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహీర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, విజయవాడ ఎంపి కేశినేని నాని, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, కెమికల్స్ శాఖ కార్యదర్శి విజయ్ శంకర్ పాండే, ముఖ్య కార్యనిర్వాహకులు బి శ్రీనివాసులు నాయక్, జోషి, కృష్ణ, ఎంపిపి పట్రా కవిత, జెసి గంధం చంద్రుడు, నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీశ, సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, మాజీ జెడ్పీ ఛైర్మన్ కడియాల రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.