కృష్ణ

కృష్ణా జలాల పథకానికి నేడు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, అక్టోబర్ 15: పేట వాసుల చిరకాల స్వప్నమైన కృష్ణా జలాలను తాగునీరుగా అందించేందుకు ఏర్పాటు చేస్తున్న పధకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు. దీనికి సంబంధించి శిలాఫలకాల ఏర్పాటును ఆయన దేశం నేతలతో కలిసి ఆదివారం పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రి టి నారాయణ, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపి కేశినేని నాని తదితరులు పాల్గొంటారని మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన అనంతరం పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌లో ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన, ఎన్‌టిఆర్ గృహకల్ప పథకం లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీ, ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

జనావాసాల మధ్య కోళ్లఫారాన్ని తొలగించండి
* ఆందోళనకు దిగిన చినహరిజనవాడవాసులు
మైలవరం, అక్టోబర్ 15: జనావాసాల మధ్య కోళ్లఫారాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ చినహరిజనవాడ వాసులు ఆదివారం ఇబ్రహీంపట్నం-చత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మైలవరాన్ని ఆనుకుని ఉన్న చినహరిజనవాడకు పక్కనే ఉన్న కోళ్లఫారం వల్ల తమకు ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, కోళ్ల విసర్జనాల వల్ల వచ్చే దుర్వాసన కారణంగా తాము ఉండలేకపోతున్నామని మలేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు సైతం ప్రబలుతున్నాయని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక కోళ్లఫారం విసర్జనాల కోసం పాములు తరచుగా వస్తున్నాయని, గతంలో ఒక వ్యక్తి పాముకాటుకు గురై చనిపోయిన సందర్భాలున్నాయని ఈకారణంగా తాము క్షణ, క్షణం భయంతో జీవిస్తున్నామని వారు పేర్కొన్నారు. జనావాసాల మధ్య కోళ్లఫారం కొనసాగుతున్న వైనం, దానివల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకుపోయి వినతిపత్రాన్ని అందించగా ఆయన వెంటనే స్పందించి కోళ్లఫారాన్ని అక్కడి నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సైతం ఆదేశించారన్నారు. కానీ ఇంత వరకూ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. మంత్రి ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి జనావాసాల మధ్య ఉన్న కోళ్లఫారాన్ని వెంటనే తొలగించి తమ ఆరోగ్యాలను రక్షించాలని వారు కోరుతున్నారు. ఈకార్యక్రమంలో రవి, డానీ, చినహరిజనవాడ యువకులు, మహిళలు పాల్గొన్నారు.