కృష్ణ

ఉయ్యూరులో ఆటోనగర్ ఏర్పాటుకోసం ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 16: రోడ్ల పక్కన అద్దె భవనాల్లో పనులు చేసుకుంటున్న తమకు ప్రత్యేకంగా ఆటోనగర్ ఏర్పాటు చేయాలని ఉయ్యూరుకు చెందిన ఫౌండ్రీ అండ్ వెల్డింగ్ వర్కర్స్ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎంతో కాలంగా వందలాదిమంది మెకానికల్ ఫీల్డ్‌ను నమ్ముకుని రోడ్ల పక్కన చిన్న చిన్న షెడ్లను అద్దెకు తీసుకుని పనులు చేసుకుంటున్నామన్నారు. రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. రెండేళ్ల కిందట ల కలెక్టర్ ఆదేశాల మేరకు ఆటోనగర్ ఏర్పాటుకై రెండు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారన్నారు. నేటి వరకు ఆటోనగర్‌లో ప్లాట్ల కేటాయింపు జరగలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు ప్లాట్లు కేటాయించాలని కోరారు. అనంతరం మీకోసంలో ఉన్న డిఆర్‌ఓ రంగయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. వీరి ఆందోళనకు సిఐటియు నాయకులు బూర సుబ్రహ్మణ్యం, శివ నాగేంద్రం సంఘీభావం తెలిపారు. ఫౌండ్రీ అండ్ వెల్డింగ్ వర్కర్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి కోటేశ్వరరావు ధర్నాకు నాయకత్వం వహించారు.

జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ బాధ్యతల స్వీకరణ

మచిలీపట్నం, అక్టోబర్ 16: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విజయ కృష్ణన్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2017వ ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ కృష్ణన్ రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. సోమవారం ఆమె విజయవాడలో కలెక్టర్ బి లక్ష్మీకాంతంను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో జెసిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా అనారోగ్య సమస్యల కారణంగా విజయవాడలో కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆమె ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. దీపావళి పండుగ తర్వాత మచిలీపట్నం రావడం జరుగుతుందన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన జిల్లా కేంద్రం మచిలీపట్నానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు.