కృష్ణ

తెదేపా పాలనలోనే చెరకురైతుకు చేదుగుళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, అక్టోబరు 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, విభజన ఆంధ్రప్రదేశ్‌లోను రైతాంగానికి మేలు చేసినది, చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం తప్ప మరోకటి లేదు. అధికారిక పర్యటనలో నిర్వహించే సభలలో తరచూ ముఖ్యమంత్రి ప్రస్తావించే వ్యాఖ్యలు ఇవి. చంద్రబాబు చెబుతున్న మాటలు నిజమేనా అన్న సందేహం డెల్టా షుగర్స్ పరిధిలోని రైతులలో వ్యక్తం అవుతోంది. అనుకోకుండా జరిగిందో, కావాలని జరుగుతుందో తెలియదు కాని తాజాగా హనుమాన్ జంక్షన్‌కు సమీపంలోని డెల్టాషుగర్స్ కర్మాగారం విషయంలో జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీ నాయకులకు సైతం ఇబ్బందికరంగా మారుతున్నాయి. షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన రెండు సంఘటనలు తెలుగుదేశం పరిపాలనలోనే జరిగాయి. 2001లో హనుమాన్ షుగర్స్ ప్రైవేటీకరణ, 2017లో నష్టాల పేరుతో డెల్టాషుగర్స్ మూసివేతకు చర్యలు చేపట్టడం. అత్యధిక మెట్ట ప్రాంతం హనుమాన్ జంక్షన్ పైభాగంలో వుండటంతోను, రెండు జిల్లాలకు కూడలిగా ఉన్న జంక్షన్ సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం గ్రామంలో 1983లో హనుమాన్ షుగర్స్ పేరుతో సహకార సంస్థ ఆధ్వర్యంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.జాతీయా రహదారి వెంబడి 100 ఏకరాల విస్తిర్ణంలో ఏర్పాటు చేసిన హనుమాన్ షుగర్స్ రైతులలో తోలుత సంతోషాలను నింపింది. ఫ్యాక్టరీ పరిధిలో నూజివీడు,తిరువూరు, విస్సన్నపేట, ముసునూరు, ఆగిరిపల్లి, గన్నవరం, గుడివాడ, దెందులూరు ప్రాంతాలకు చెందిన రైతులు వుండేవారు. కర్మాగారం పరిధిలో 15వేల ఏకరాల వరకు చెరుకుసాగు విస్తీర్ణంలో వుండేది. సహకార వ్యవస్థ ఉన్న సమయంలో ఫ్యాక్టరీ నిర్వహణలో లోపాలు, సిబ్బంది అలసత్వం కారణంగా హనుమాన్ షుగర్స్ కాలక్రమేణా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 1998 నుంచి చెరుకు క్రషింగ్ చేసేందుకు, రైతులు ఫ్యాక్టరీకి తోలిన చెరకుపంట బిల్లులు చెల్లించేందుకు సైతం నిధుల కొరత ఎదుర్కొంది. 2000లో బకాయిల కోసం రైతులు రోడ్టెక్కారు. దీంతో తెదేపాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి 2001లో హనుమాన్ షుగర్స్ ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపారు. దీనిపై చెరకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. హనుమాన్ షుగర్స్‌ను ప్రస్తుత నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజుకు చెందిన లైలా గ్రూపు 11.40కోట్లకు కోనుగోలు చేసింది. అప్పటివరకు హనుమాన్‌షుగర్స్ కాస్తా డెల్టా షుగర్స్‌గా మార్పు చెందింది. ప్రభుత్వం ఏకపక్షంగా షుగర్ ఫ్యాక్టరీని విక్రయించిందని ఆరోపిస్తూ రైతుసంఘాల ప్రతినిధులు ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీని కొనుగోలు చేసిన డెల్టా షుగర్స్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టి లాభాలబాటలోకి తీసుకువచ్చింది. రుణాలు, మద్దతు ధర విషయాల్లో సానుకూల వైఖరి కనబర్చి రైతులను అకట్టుకోవడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. చెరుకు విస్తీర్ణం సాగును గణనీయంగా పెంచుతూ వచ్చిన డెల్టాషుగర్స్ యాజమాన్యం మద్దతు ధర విషయంలో నిర్లక్ష్యం వహించింది. డెల్టా ఇస్తున్న మద్దతు ధర తమకు గిట్టుబాటు కావడంలేదని, మద్దతు ధర పెంచమని రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఇలానే ఇస్తాం వచ్చే సంవత్సరం పెంచుతామనే ధోరణిలో డెల్టా యాజమాన్యం తాత్సారం చేసింది. మద్దతు ధర పెరగకపోవడం, ఖర్చులు పెరగడం రైతులలో చెరకుసాగు పట్ల విరక్తి కలగడంతో ప్రతిఏటా విస్తీర్ణం తగ్గుముఖం పడుతూ వచ్చింది. 2015 సంవత్సరంలో డెల్టాషుగర్స్‌ను మూసివేస్తారని, ఆ ప్రదేశంలో డెంటల్ కాలేజి పెడుతున్నారనే వార్తలతో రైతాంగం ఉలిక్కిపడింది. అప్పట్లో పత్రికలలో వచ్చిన వార్తలను ఖండించిన డెల్టా యాజమాన్యం రెండు సీజన్లపాటు చెరకు క్రషింగ్‌ను కొనసాగించింది. 2017-18 సంవత్సరానికి చెరకు మద్దతు ధర ప్రకటిస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు డెల్టాషుగర్స్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. డెల్టా షుగర్స్ నష్టాలలో వుందని, ప్రతి ఏటా 9 కోట్ల మేర అప్పులకు వడ్డీ కడుతున్నామని డెల్టా షుగర్స్ ప్రతినిధులు రైతులకు తెలిపారు. ఈ ఏడాది క్రషింగ్ చేయడం వలనే నష్టాలు మరింత పెరిగే అవకాశం వుండడంతో ఉయ్యూరు కెసిపి షుగర్స్‌తో ఈ సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించారు. ఈ సీజను క్రషింగ్ ఉయ్యూరు కెసిపిలో జరుగుతుందని స్పష్టం చేశారు. యాజమాన్యం ప్రకటించిన నిర్ణయంతో రైతులు షాక్‌కు గురయ్యారు. లాభాలలో వున్నా ఫ్యాక్టరీ నష్టాల్లో వుందని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టా షుగర్స్‌ను మూసివేయాలని నిర్ణయించేందుకే యాజమాన్యం ఈ చర్యలు చేపడుతోందని ఆరోపించారు. దీనిపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అందుకు అనుగుణంగానే 18వ తేదీన డెల్టా షుగర్స్ అవరణలో ఏరియా రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల సమావేశంలో ఏదైనా పోరాటానికి పిలుపునిస్తే అధికార పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం వుంది. 2001లో అప్పటి తెలుగుదేశం పరిపాలనలోనే షుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశారు. అప్పట్లో తెలుగుదేశంపై రైతుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా మరోసారి తెలుగుదేశం పరిపాలనలోనే డెల్టా షుగర్స్ మూసివేత జరుగుతున్న వార్తలు అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమేనని రైతు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చెరకు మద్దతు ధర కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ఆందోళన చేసిన తెదేపా నాయకులు ఇప్పుడు రైతులకు బాసటగా నిలుస్తారో, డెల్టా షుగర్స్ యాజమాన్యం చర్యలకు సహకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. విపక్ష నాయకులు రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యాచరణ ప్రకటించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.