కృష్ణ

మోపిదేవి హెచ్‌పి బంక్‌లో కల్తీ డీజిల్ విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, అక్టోబర్ 17: మండల కేంద్రం మోపిదేవిలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం బంక్‌లో మంగళవారం ఉదయం డీజిల్ కొట్టించుకున్న వాహనాలన్నీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోవటంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. లీటర్లకు లీటర్లు ఆయిల్ కొట్టించుకున్న కొద్దిపాటి దూరానికి వాహనాలు నిలిచిపోవటంతో కంగుతిన్నవారు వారి వారి వాహన ట్యాంక్‌లను చూసుకోగా పూర్తిగా ఆయిల్ ఉండటంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వారి వాహనాల ట్యాంక్‌లోని డీజిల్‌ను బయటకు తీసి చూడగా కలుషిత నీటితో డీజిల్ కల్తీ అవ్వడాన్ని గమనించారు. దీంతో వాహనదారులంతా పెట్రోలు బంక్ వద్ద ఆందోళనకు దిగారు. అప్పటికే పెట్రోలు బంక్‌లో ఉన్న వాహనదారులు కూడా పెట్రోలు పంపుల్లో నుండి వస్తున్న ఆయిల్‌ను పరిశీలించగా కల్తీ ఆయిల్ రావడాన్ని గమనించి ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తూనికలు కొలతలు, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖాధికారులు రంగ ప్రవేశం చేసి పెట్రోలు బంక్‌లో తనిఖీలు నిర్వహించారు. పెట్రోలు బంక్ పక్కనే మురుగు కాలువ ఉండటంతో ట్యాంక్‌కు చిల్లు పడి ఆ నీరు డీజిల్‌లో కలుషితమై ఉండవచ్చని హిందుస్థాన్ పెట్రోలియం సేల్స్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పలు శాఖల అధికారులు వేర్వేరుగా వచ్చి బంక్‌లో తనిఖీలు నిర్వహించి డీజిల్ కల్తీ అయినట్లు గుర్తించారు. దీంతో తహశీల్దార్ విమల కుమారి సంబంధిత బంక్ యజమానిపై 6ఎ కేసు నమోదు చేసి బంక్‌ను సీజ్ చేశారు.