కృష్ణ

ఇదెక్కడి న్యాయమమ్మా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 17: ఇదెక్కడి న్యాయమమ్మా.. ఉచిత వైద్యం కోసం పెద్దాస్పత్రికి వస్తే డబ్బులు ఇవ్వాలంటున్నారు.. నాకు ఇచ్చే సోమత లేదని చెప్పినా కనికరించడం లేదు.. డబ్బు ఇస్తేనే వైద్యం చేస్తానని రోజులు గడుపుతున్నారు.. రోడ్డు ప్రమాదంలో ఏర్పడిన గాయాలతో తన కొడుకు తల్లడిల్లుతున్నా ఈ ఆస్పత్రిలో పట్టించుకునే నాధుడే కరువయ్యారు.. ఇక్కడ కాకపోతే మరో ఆస్పత్రికి వెళతామని వేడుకున్నా డిశ్చార్జ్ చేయనంటున్నారని ఓ మహిళ మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ వద్ద వాపోయింది. గైనిక్ విభాగాన్ని అనూరాధ తనిఖీ చేస్తున్న తోటివారిని ఆమె ఎవరని అడిగి తెలుసుకున్న ఆ మహిళ నేరుగా చైర్‌పర్సన్ వద్దకు వెళ్లి కాళ్ల మీద పడి తన కొడుకుకి ‘నువ్వే వైద్యం చేయించమ్మా..’ అంటూ వేడుకుంది. దీంతో ఖంగుతిన్న చైర్‌పర్సన్ అనూరాధ ఆమెను పైకిలేపి వివరాలు అడిగి తెలుసుకుంది. పెడనకు చెందిన తన కొడుకు జంగం ప్రభు కీర్తి ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో మోచిప్ప విరిగిపోవటంతో ఆస్పత్రికి తీసుకు వచ్చానని, సంబంధిత వైద్యుడు డా. వినయ్ కుమార్ రాడ్లు వేయాలి ఇందుకు రూ.15వేలు డిమాండ్ చేసినట్లు తెలిపింది. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే తాను అంత మొత్తం ఇవ్వలేనని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయాలని వేడుకున్నా కనికరించలేదని కన్నీరుమున్నీరై ఫిర్యాదు చేసింది.
అతనిపై తక్షణమే చర్యలు తీసుకోండి:
మంత్రి కామినేనికి ఫోన్‌లో చైర్‌పర్సన్ ఫిర్యాదు
ఈ ఘటనపై జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తీవ్రంగా స్పందించారు. ఆమె ఆవేదన విన్న వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్‌కు నేరుగా ఫోన్ చేసి సంబంధిత వైద్యుడిపై ఫిర్యాదు చేశారు. ఇతనిపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు వచ్చాయని, చాలాసార్లు తాను మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రావడం లేదని మంత్రికి తెలిపారు. దీనిపై విచారణ నిర్వహించి సంబంధిత వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కామినేనిని చైర్‌పర్సన్ అనూరాధ కోరారు. ఆ తర్వాత సంబంధిత వైద్యుడికి కూడా ఆమె ఫోన్ చేసి తీవ్రంగా మందలించారు.