కృష్ణ

దుబాయ్‌లో ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 20: ప్రపంచంలో నివశిస్తున్న ప్రవాసాంధ్రుల రాష్ట్ర ప్రభుత్వం చేదోడువాదోడుగా నిలుస్తోందని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ, ప్రవాసాంధ్రుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎపి ఎన్‌ఆర్టీ శాఖ రూపొందించిన ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికై శుక్రవారం దుబాయ్ వెళ్లారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన మంత్రికి దుబాయ్‌లో ఎపి ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు రవికుమార్, ఇఎఇ, కువైట్, సౌదీ కో-ఆర్డినేటర్లు స్వాగతం పలికారు. శనివారం ఎన్‌ఆర్‌ఐ పాలసీని మంత్రి రవీంద్ర ప్రారంభించనున్నారు.

పోలీసు అమరవీరుల సంక్షేమానికి కృషి: ఎస్పీ త్రిపాఠి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 20: విధి నిర్వహణలో ఆత్మార్పణ చేసిన పోలీసు అమరవీరుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హామీ ఇచ్చారు. జిల్లాలో పని చేస్తూ విధి నిర్వహణలో మృతి చెందిన 12 మంది అమరవీరుల కుటుంబ సభ్యులతో శుక్రవారం ఎస్పీ త్రిపాఠి సమావేశమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కారుణ్య నియామకాలకు శాఖాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా శాఖాధిపతులతో మాట్లాడి ఎటువంటి అవరోధాలు లేకుండా చూస్తానని ఎస్పీ త్రిపాఠి హామీ ఇచ్చారు.

జెసి-2 మార్కండేయులు బదిలీ
* రానున్న బాబురావు

మచిలీపట్నం, అక్టోబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డెప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా జాయింట్ కలెక్టర్-2గా పని చేస్తున్న బి మర్కండేయులు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్-2గా మార్కండేయులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్ 12న జెసి-2గా బాధ్యతలు స్వీకరించిన మార్కండేయులు ఐదు నెలలకే బదిలీ కావడం విశేషం. మార్కండేయులు స్థానంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పిడు గు బాబూరావు నియమితులయ్యారు.