కృష్ణ

ఎట్టకేలకు డిఆర్‌ఓ పోస్టు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 20: ఎట్టకేలకు జిల్లా రెవెన్యూ అధికారిగా పూర్తి స్థాయి అధికారి నియమితులయ్యారు. నెల్లూరు ఎస్‌సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండున్నర సంవత్సరాలుగా డిఆర్‌ఓ పోస్టు ఇన్‌ఛార్జ్‌ల పాలనలో సాగింది. గతంలో డిఆర్‌ఓగా పనిచేసిన ఆలపాటి ప్రభావతి 2015వ సంవత్సరం జూన్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుండి డిఆర్‌ఓగా పూర్తి స్థాయి అధికారి నియామకం జరగలేదు. బందరు ఆర్డీవో సాయిబాబు కొంత కాలం, నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, ముడ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ఇటీవల సచివాలయానికి బదిలీ అయిన వేణుగోపాలరెడ్డి కొంత కాలం ఇన్‌ఛార్జ్ డిఆర్‌ఓగా పనిచేశారు. ప్రస్తుతం నూజివీడు ఆర్డీవో రంగయ్య ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది డెప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగానే జిల్లా రెవెన్యూ అధికారిగా నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఇడి అంబేద్కర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2008లో నేరుగా డెప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన అంబేద్కర్ 15 నెలల పాటు వరంగల్ జిల్లాలో ప్రొహిబిషన్ డెప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. ఆ తర్వాత తొలి పోస్టింగ్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఆర్డీవోగా యేడాది న్నర పాటు పని చేశారు. 2010 ఆగస్టులో విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవోగా బదిలీ అయి రెండేళ్లపాటు పనిచేశారు. 2012-14 మధ్య పార్వతీపురంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పిఓగా పని చేశారు. 2014 ఫిబ్రవరిలో కాకినాడ ఆర్డీవోగా రెండేళ్లపాటు పని చేశారు. 2017 ఫిబ్రవరి నుండి నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఇడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ అయిన ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.