కృష్ణ

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 21: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆర్మ్డ్ రిజర్వు అడిషనల్ ఎస్పీ కె శేఖర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం జిల్లాలో విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను ఎఆర్ అడిషనల్ ఎస్పీ శేఖర్ పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత జనవరి నెల 19వతేదీన విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ వి సుబ్రహ్మణ్యేశ్వరరావుకు పోలీసు భద్రతా పథం కింద మంజూరైన రూ.4లక్షలు చెక్కును ఆయన సతీమణి విన్నకోట మణిమంజరికి అందజేశారు. అలాగే గత జనవరి నెల 17వతేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు, గత జూన్ 8వతేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ పివి వెంకట్రావు కుటుంబాలకు డిజిపి కార్యాలయం నుండి జారీ చేసిన జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తొలుత పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు ఎస్పీ త్రిపాఠి బహుమతి ప్రదానం చేశారు. పోలీసు సిబ్బంది విభాగంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో తిరువూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్ గోపి ప్రథమ బహుమతి, స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వి జయరామ్ ద్వితీయ బహుమతి, మైలవరం పిఎస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఎ మాధవి తృతీయ బహుమతిని అందుకున్నారు. పోలీసు అధికారుల విభాగంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పెనుగంచిప్రోలు ఎస్‌ఐ అవినాష్, ఆర్‌ఎస్‌ఐ కెవిఎస్‌ఆర్ కృష్ణ, గంపలగూడెం ఎస్‌ఐ పి శివరామకృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందుకున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మీర్జాపురం న్యూ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి వి సౌజన్య ప్రథమ, చల్లపల్లి ఎస్‌ఆర్‌వైఎస్‌పి హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎన్ మేఘన కుమార్ ద్వితీయ, నూజివీడు సెయింట్ థామస్స్ హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎం మనోజ్ కుమార్ తృతీయ బహుమతి పొందాడు. చిత్రలేఖన పోటీల్లో మచిలీపట్నం ఎపిఆర్‌ఎస్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి పి అశోక్, కోడూరు లక్ష్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన లక్ష్మి కిషోర్, కూచిపూడి శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన ఎస్‌కె నగీనా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కార్టూన్ పోటీల్లో మచిలీపట్నం ఎపిఆర్‌ఎస్‌కు చెందిన కె కార్తికేయ ప్రథమ, చల్లపల్లి ఎస్‌ఆర్‌వైఎస్‌పి హైస్కూల్‌కు చెందిన జి రవితేజ ద్వితీయ, కూచిపూడి హోలిస్పిరిట్ స్కూల్‌కు చెందిన కె దాక్షాయని తృతీయ బహుమతులను ఎస్పీ త్రిపాఠి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బందరు డిఎస్పీ యండి మహబూబ్ బాషా, మహిళా పిఎస్ డిఎస్పీ లక్ష్మీ నారాయణ, ఎస్‌సి, ఎస్‌టి సెల్ డిఎస్పీ హరిరాజేంద్ర బాబు, ట్రాఫిక్ డిఎస్పీ షేక్ హుస్సేన్, ఆర్‌ఐలు కృష్ణంరాజు, నాగిరెడ్డి, సిఐలు వాసవి, శ్యామ్‌కుమార్, బిబి రవి కుమార్, సాయిప్రసాద్, ఆకుల రఘు, దుర్గాప్రసాద్, పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.