కృష్ణ

వచ్చే ఎన్నికల్లోనూ విజయం టిడిపిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, అక్టోబర్ 21: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో మరలా తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపడుతుందని ఇందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాల్లో ప్రజలు చూపెడుతున్న ఆదరాభిమానాలే నిదర్శనమని మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. పామర్రు మండలం జుజ్జువరం గ్రామంలో శనివారం పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజారంజకంగా సాగుతున్న చంద్రబాబు పాలనలో రైతులు, మహిళలు, బడుగు, బలహీనవర్గాలు, పేదలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. పోలవరం పూర్తి చేసి రైతుల పాలిట దైవంగా చంద్రబాబు నిలుస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్ను నాగమురళీ, సొసైటీ ప్రెసిడెంట్ జన్ను శోభన్‌బాబు, పామర్రు మండల టిడిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులు కుదరవల్లి ప్రవీణ్‌కుమార్, దాలిపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ వెంకటేశ్వరమ్మ అనే మహిళకు వైద్య చికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 50వేల చెక్కును ఎమ్మెల్యే కల్పన అందజేశారు. అనంతరం పామర్రు మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ జోగి శ్రీనివాసరావు సతీమణి మృతి చెందటంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.

అగ్రిగోల్డ్ యాజమాన్యానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు అండగా నిలవడం బాధాకరం
*సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు
గుడివాడ, అక్టోబర్ 21: అగ్రిగోల్డ్ యాజమాన్యానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు అండగా నిలవడం బాధాకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. శనివారం గుడివాడ వచ్చిన ఆయన పోలీస్‌స్టేషన్లలో అగ్రిగోల్డ్ బాధితుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎన్జీవో హోంలో జరిగిన గుడివాడ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆర్థిక కుంభకోణాలపై కమ్యూనిస్టు పార్టీలు సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నాయన్నారు. టిడిపి, వైసీపీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలవలేదన్నారు. చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోదుమూడి రామారావు, నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్‌బాబు, అసోసియేషన్ జిల్లా కన్వీనర్ పి మురళీకృష్ణ, గుడివాడ అధ్యక్షుడు వి రామారావు తదితరులు పాల్గొన్నారు.