కృష్ణ

మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 22: స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చనలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తాడిగడప వరప్రసాద్, పండితుల రుద్రసూక్తం నేపథ్యంలో 11 విడతలు నమక చమకాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చనలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో కాశీబొట్ల నారాయణమూర్తి దంపతులు, ఆలయ అర్చకులు పెనుమూడి కాశీవిశ్వనాధం, నాగ నరేంద్ర శర్మ, పూర్ణచంద్రశేఖర శర్మలు భక్తులకు తీర్ధప్రసాద వినియోగం చేశారు.

ఉత్కంఠ భరితంగా సాగుతున్న 63వ రాష్టస్థ్రాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు
గుడివాడ, అక్టోబర్ 22: గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అండర్-17 బాలుర, బాలికల 63వ రాష్టస్థ్రాయి వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పోటీల రాష్ట్ర పరిశీలకులు సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ 23వ తేదీన కూడా పోటీలు కొనసాగుతాయన్నారు. అనంతరం బాలుర, బాలికల విభాగాల జట్లను ఎంపిక చేస్తామన్నారు. రెండవ రోజు పోటీలు ముగిసే సమయానికి పలు విభాగాల్లో విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలికల 44కేజీల విభాగంలో బి జ్యోతి (కడప) ప్రథమ, ఎం సత్యవతి (వైజాగ్) ద్వితీయ, ఎస్‌కె నజ్మా (గుంటూరు) తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే 44-48 కేజీల విభాగంలో ఎస్ పల్లవి (విజయనగరం) ప్రథమ, ఒ గాయత్రి (కడప) ద్వితీయ, ఎన్ లక్ష్మీకళ (కడప) తృతీయ స్థానాలను, 48-53కేజీల విభాగంలో ఎస్ మహబూబ్ చంద్ (కడప) ప్రథమ, ఎస్‌కె సాదియాఅల్మాస్ (గుంటూరు) ద్వితీయ, ఎన్ బాబి (తూర్పుగోదావరి) తృతీయ స్థానాలను, 53-58కేజీల విభాగంలో ఆర్ భారతి (కడప) ప్రథమ, సిహెచ్ శ్రీలక్ష్మి (విజయనగరం) ద్వితీయ, పి ధనము (శ్రీకాకుళం) తృతీయ స్థానాలను, 58-63కేజీల విభాగంలో కె అభిషిక్త (తూర్పుగోదావరి) ప్రథమ, పి హేమభార్గవి (పశ్చిమగోదావరి) ద్వితీయ, జె సుమ (కడప) తృతీయ స్థానాలను, 63-69కేజీల విభాగంలో పి ధార్తి (తూర్పుగోదావరి) ప్రథమ, బి ఝాన్సీ (కడప) ద్వితీయ, ఎల్ కీర్తి (శ్రీకాకుళం) తృతీయ స్థానాలను, 69-75కేజీల విభాగంలో ఎం కీర్తి (తూర్పుగోదావరి) ప్రథమ, ఆర్ ధనలక్ష్మి (శ్రీకాకుళం) ద్వితీయ, ఎస్ భార్గవి (నెల్లూరు) తృతీయ స్థానాలను, 75కేజీల పైబడి విభాగంలో వై అనూష (తూర్పూగోదావరి) ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే బాలుర విభాగంలో 50కేజీల లోపు విభాగంలో ఎం తిరుపతిరావు (శ్రీకాకుళం) ప్రథమ, డి వౌలాలి (గుంటూరు) ద్వితీయ, వి దినేష్‌కుమార్ (విజయనగరం) తృతీయ స్థానాలను, 50-56 కేజీల విభాగంలో ఎం స్వరూపకుమార్ రాజ్ (కడప) ప్రథమ, ఆర్ రాంబాబు (విజయనగరం) ద్వితీయ, సి పవన్‌కుమార్ (తూర్పుగోదావరి) తృతీయ స్థానాలను, 56-62కేజీల విభాగంలో జి రవిశంకర్ (కడప) ప్రథమ, ఎం హేమంత్ గంగాధదర్ (పశ్చిమగోదావరి) ద్వితీయ, ఎం మణికంఠ (విజయనగరం) తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెయిట్‌లిఫ్టింగ్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎం దామోదర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె శకుంతలాదేవి తదితరులు పాల్గొన్నారు.