కృష్ణ

లక్ష మంది భక్తులకు నాగుల చవితి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, అక్టోబర్ 22: మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా లక్ష మంది భక్తులకు పైగా స్వామివారి నాగపుట్టలో పాలు పోస్తారనే అంచనాలతో ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఏసి యం శారదా కుమారి ఆదివారం తెలిపారు. ఉదయం 3గంటలకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు నాగపుట్టకు తొలి పూజ నిర్వహించటం జరుగుతుందన్నారు. అవనిగడ్డ డిఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో చల్లపల్లి సిఐ జనార్ధన్ ఆరుగురు ఎస్‌ఐలు, 125 మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయం తరపున 80 మంది వాలంటీర్లు భక్తుల సేవలందిస్తారని తెలిపారు. భక్తులకు పాలు, మజ్జిగ, మంచినీరు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు ఏసి తెలిపారు. మోపిదేవి పిహెచ్‌సి తరపున ఆలయంలో మెడికల్ క్యాంప్ జరుగుతుందన్నారు. ఆలయం సప్తవర్ణ శోభితమైన విద్యుత్ దీపాలతో వెలుగొందుతోంది. ఆలయం వెలుపల చాందిని డెకరేషన్ భక్తులను ఆకర్షించే విధంగా ఉంది. చల్లపల్లి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరయ్యబాబు ఆధ్వర్యంలో కాకరపత్తి సౌజన్యంతో సభ్యులు వరదా భరత్ రవి సహకారంతో ఉదయం 10గంటలు నుండి సాయంత్రం 5గంటల వరకు నిరంతరాయంగా అన్నదానం నిర్వహించనున్నట్లు సురేష్ తెలిపారు.