కృష్ణ

ముగిసిన 63వ ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 23: మూడు రోజులుగా గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 63వ ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి అంతర్ జిల్లాల అండర్-17 బాలబాలికల వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు సోమవారం సాయంత్రంతో ముగిసాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా కడప జిల్లా ప్రథమ, అనంతపురం జిల్లా ద్వితీయ, శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానాల్లో, బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ, కడప జిల్లా ద్వితీయ, కృష్ణాజిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి. కాగా అండర్-17 బాలుర రాష్ట్ర జట్టుకు 50కేజీల లోపు విభాగంలో ఎం తిరుపతిరావు(శ్రీకాకుళం), 50-56కేజీల విభాగంలో ఎం స్వరూప్ కుమార్‌రాజ్(కడప), 56-62కేజీల విభాగంలో జి రవిశంకర్(కడప), 62-69కేజీల విభాగంలో ఎం సాకేత్(ప్రకాశం), 69-77కేజీల విభాగంలో సిహెచ్ మధు(విజయనగరం), 77-85కేజీల విభాగంలో జి గురుహరినాథ్‌రెడ్డి(కడప), 85-94కేజీల విభాగంలో జి రవి(శ్రీకాకుళం), 94కేజీల పైబడి విభాగంలో టి ఇమ్మానియేల్(గుంటూరు)లు ఎంపికయ్యారు. బాలికల రాష్ట్ర జట్టుకు 44కేజీల లోపు విభాగంలో బి జ్యోతి కడప, 44-48కేజీల విభాగంలో ఎస్ పల్లవి(విజయనగరం), 48-53కేజీల విభాగంలో ఎస్ మహబూబ్‌చంద్(కడప), 53-58కేజీల విభాగంలో ఆర్ భారతి(కడప), 58-63కేజీల విభాగంలో కె అభిషిక్త(తూర్పుగోదావరి), 63-69కేజీల విభాగంలో పి ధాత్రి(తూర్పుగోదావరి), 69-75కేజీల విభాగంలో ఎం కీర్తి(తూర్పుగోదావరి), 75కేజీల పైబడి విభాగంలో వై అనూష(తూర్పుగోదావరి)లు ఎంపికయ్యారు.