కృష్ణ

జిల్లాలో ఏడు పత్తి కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 23: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా జిల్లాలో పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు గాను ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మార్కెటింగ్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిసిఐ నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలు రూ.4320లకు కొనుగోలు చేస్తామన్నారు. పశ్చిమ కృష్ణాలో జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారీలను నమ్మి నష్టపోవద్దని కోరారు. పట్టాదార్ పాస్ పుస్తకం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్‌తో పాటు సాగు ధృవీకరణ పత్రాలతో రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోవచ్చన్నారు. 8శాతం తేమ ఉండాలన్నారు. అంతకుమించి తేమ శాతం ఉంటే ప్రతి ఒక శాతానికి రూ.43.20పైసలు చొప్పున ధర తగ్గుతుందన్నారు. 12 శాతం కంటే ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేయడం జరగదన్నారు.

ఎఎంసిల ద్వారా పెసలు, మినుములు కొనుగోలు చేయాలి

* మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యే సౌమ్య వినతి

నందిగామ, అక్టోబర్ 23: మార్కెట్ కమిటీల ద్వారా పెసలు, మినుములు కొనుగోలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు. నందిగామ, కంచికచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌లు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నన్నపనేని లక్ష్మీనారాయణ, జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, కంచికచర్ల జడ్‌పిటిసి కోగంటి బాబు తదితర నేతలతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం సచివాలయంలో మంత్రి ఆదినారాయణరెడ్డిని కలిసి రైతు సమస్యలపై చర్చించారు. సుబాబుల్ పాత బకాయిలను చెల్లింపు విషయంపై మంత్రి నారా లోకేష్ అంగీకారం తెలపడం జరిగిందని, అవి త్వరగా చెల్లింపులు జరిగే విధంగా చూడాలని మంత్రి ఆదినారాయణరెడ్డిని కోరారు. అదే విధంగా సుబాబుల్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధరతో కొనుగోలు జరిగే విధంగా చూడాలని, ఆర్‌సి విధానం రద్దు చేయాలని నందిగామ యార్డ్ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు మంత్రిని కోరారు.