కృష్ణ

పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 23: ప్రతి ఒక్క పోలీసూ విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో సోమవారం ఆయన విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది వారి వారి నడవడికను సరిదిద్దుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు. గత మూడు నెలలుగా రహదారి భద్రతపై తీసుకున్న చర్యల కారణంగా సత్ఫలితాలను సాధించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గటంతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా నివారించగలిగామన్నారు. శాఖాపరంగా ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను కంప్యూటరీకరించాలని ఆదేశించారు. సిసిటిఎస్‌ఎస్ (క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టం)ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. తద్వారా బాధితులు తమ కేసు ఏ స్థితిలో ఉందో ఆన్‌లైన్‌లో తమ ఇంటి వద్ద నుండే తెలుసుకోవచ్చన్నారు. మీసేవ ద్వారా పోలీసు స్టేషన్లకు చేసుకునే దరఖాస్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి సత్వరం సంబంధిత పత్రాలను అర్హులకు జారీ అయ్యేలా చూడాలన్నారు. పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, వ్యక్తిగత ప్రవర్తనలోనూ పోలీసు అధికారిగా రూపుదిద్దుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీలు యండి మహబూబ్ బాషా, మహేష్, శ్రీనివాస్, రాధేష్ మురళీ, పోతురాజు, షేక్ హుస్సేన్, తిలక్, హరిరాజేంద్ర ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఆకుల రఘు తదితరులు పాల్గొన్నారు.