కృష్ణ

మేమంతా చిన్న రైతులమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 16: రైతులంతా ఒకటై కలిసి వస్తేనే బందరు పోర్టును నిర్మించుకోవడం జరుగుతుందని లేని పక్షంలో పోర్టు చేజారిపోయే పరిస్థితులు ఏర్పడతాయని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ అంశంపై గురువారం రాత్రి ఆయన మండల పరిధిలోని మేకావానిపాలెం గ్రామ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూసమీకరణ కారణంగా రైతుల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేశారు. తామంతా చిన్నపాటి రైతులమని, భూసమీకరణ వల్ల తాము ఎటువంటి తక్షణ ప్రయోజనం పొందలేమని, దీన్ని దృష్టిలోకి తీసుకుని తమ భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని పలువురు రైతులు మంత్రి రవీంద్రకు తెలియజేశారు. తామంతా పోర్టుకు వ్యతిరేకం కాదని చెప్పారు. పెద్ద రైతులకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుని తమ భూములను భూసేకరణ ద్వారా తీసుకుని పరిహారం ఇవ్వాలని కోరారు. తపసిపూడి, గోపువానిపాలెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక డొంక రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి పర్చాలని మంత్రిని కోరారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అవసరమైతే భూసేకరణ ద్వారా కూడా భూములు తీసుకుంటామన్నారు. భూసేకరణ కన్నా భూసమీకరణ ద్వారానే ప్రయోజనం ఉంటుందని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, కుంచే దుర్గా ప్రసాద్ (నాని), వాలిశెట్టి బాబు, నారగాని ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
* కమిషనర్ జస్వంతరావు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 16: మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని కమిషనర్ జస్వంతరావు కోరారు. గురువారం కమిషనర్ తన చాంబర్‌లో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో జరిగే రోజు వారి కరస్పాండెన్స్ ఈ-ఆఫీసు విధానంలోనే జరగాలన్నారు. పురపాలక సంఘానికి వచ్చే అర్జీదారులతో సమన్వయంగా వ్యవహరించాలన్నారు. మెయిల్స్ ద్వారా వచ్చే ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని అన్ని వర్కులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌ల వాడకాన్ని ప్రజలు నిషేధించే విధంగా కృషి చేయాలన్నారు. నూరుశాతం పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ వారిని ఆదేశించారు. అలాగే ప్రజాసాధికారిక సర్వేలో మిగిలిన ఇ కెవైసీల త్వరితగతిన పూర్తి చేసి చంద్రన్న బీమా నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.