కృష్ణ

దివ్యాంగులపై లైంగిక దాడి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపలగూడెం, నవంబర్ 16: దివ్యాంగులపై లైంగిక దాడి అమానూషమని అత్యాచార, అసాంఘీక శక్తులు ఎంతటివారైన కఠిన చర్యలు తప్పవని నూజివీడు డిఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం మండలంలోని నెమలి గ్రామంలో ఇరువురు దివ్యాంగ బాలికలపై లైంగిక దాడి కేసులో విచారం నిమిత్తం విచ్చేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించి వికలాంగుల దుస్తులను స్వాధీనపర్చుకున్నారు. బాలికలను వారి తల్లిదండ్రులను విచారణ గావించారు. ఇలాంటి సంఘటనలు సభ్యసమాజానికి సిగ్గుచేటని అన్నారు. లైంగిక దాడులను ప్రజలంతా ఖండించి చట్టానికి, పోలీసులకు సహకరిస్తే నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు సిఐ కెవివిఎన్ సత్యనారాయణ, స్ధానిక ఎస్‌ఐ పి శివరామకృష్ణ, తహశీల్దార్ షాకీర్‌ఉన్నీసాబేగం పాల్గొన్నారు.
దివ్యాంగులను పరామర్శించిన చైర్మన్
వికలాంగులపై లైంగిక వేధింపులు హేయమైన చర్య అని రాష్ట్ర వికలాంగుల ఫెడరేషన్ చైర్మన్ జి కోటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి అన్నారు. గురువారం నెమలిలోని దివ్యాంగులను పరామర్శించారు. ఈ సందర్భంగా దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వారి తల్లిదండ్రులను కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వడ్లమూడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

డోకిపర్రులోకు సినీ ప్రముఖుల సందడి
* వెంకన్న కల్యాణోత్సవంలో సినీ సందడి
గుడ్లవల్లేరు, నవంబర్ 16: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో సినీ నటులు సందడి చేశారు. గ్రామంలో వేంచేసియున్న శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేష్‌తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత స్వామివారికి దర్శించుకుని చక్రస్నానంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. మెయిల్ ఎండీ పురిటిపాటి వీరారెడ్డి, విజయలక్ష్మి దంపతులు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలి వచ్చారు. ఉదయం స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం సుధారెడ్డి ప్రారంభించిన అన్నసమారాధనలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. నటుడు వెంకటేష్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో ఆయనే స్వయంగా వారి వద్దకు వెళ్లి అభివాదం తెలిపారు.