కృష్ణ

ఉరుకులు, పరుగులతో ధాన్య రక్షణకు రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, నవంబర్ 16: యంత్రాలతో కోసి ఆరబెట్టిన ధాన్యం రక్షణకు రైతులు ఉరుకులు, పరుగులు తీశారు. గురువారం సాయంత్రం ఆకాశం మేఘవృతమై తేలికపాటి జల్లులు పడటంతో ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా వాతావరణం రైతన్నలతో దోబూచు లాడుతోంది. జూలై నెలలో నాటిన ఎంటీయు 1061 రకం నుండి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నాటిన ఎంటీయు 5204 రకం బీపీటీలు, 5104, 51048 కర్నాటక మసూరిలు ఏపుగా పండి కోతలకు సిద్ధమవటంతో పెద్ద రైతులు యంత్రాలతో వరి కోతలు ప్రారంభించారు. సంప్రదాయవాదులు వరికోతల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఏదిఏమైనా వాతావరణం అనుకూలంగా ఉంటే సోమవారం నుండి మొవ్వ మండలంలో వరి కోతలు ముమ్మరంగా చేపట్టేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. వర్షాలు పడితే పంట చేతికి వస్తుందో రాదో అనే ఆందోళనతో రైతులకు కంటిమీద కునుకు దూరమవుతుంది.

ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ‘బిగ్ హెల్ప్’

నూజివీడు, నవంబర్ 16:నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బిగ్ హెల్ప్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు ట్రిపుల్ ఐటీలో ప్రధమ సంవత్సరం చదువుతున్న 70 మందిని గురువారం ఎంపిక చేశారు. వీరికి ప్రతి ఏటా 5000 రూపాయల చొప్పున ఆరు సంవత్సరాల పాటు అందజేస్తున్నట్లు బిగ్‌హెల్ప్ ప్రతినిధి చాంద్‌బాషా తెలిపారు. పేద విద్యార్థులను ఇతోధికంగా ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంక్షేమ అధికారి నాగార్జునదేవి తదితరులు పాల్గొన్నారు.