కృష్ణ

పోర్టు మహాయజ్ఞంలో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 16: జిల్లా ప్రాంత రూపురేఖలు మార్చే బందరు ఓడరేవు నిర్మాణ సమయం అసన్నమైందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి రవీంద్ర కోరారు. పోర్టు ఉద్యమంలో భాగస్వాములైన మాదిరిగానే పోర్టు నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలన్నారు. ల్యాండ్ పూలింగ్ వల్ల కలిగే లబ్ధిని భూములిచ్చే రైతులకు వివరించి భూసమీకరణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. రైతులు, వ్యాపారస్థుల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయని, ఆ సంబంధాలను పోర్టు సాధనకు ఉపయోగించాలన్నారు. పోర్టు ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ నెల 19వతేదీన పార్టీలకు అతీతంగా రెవెన్యూ కల్యాణ మండపంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ అభిప్రాయాలను తెలియపర్చటంతో పాటు రైతులను మేల్కొపే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గత మూడున్నర ఏళ్లుగా మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పర్యాటక పరంగా మంగినపూడి బీచ్‌ను తీర్చిదిద్దామన్నారు. ఫలితంగా సాధారణ రోజుల్లో కూడా పర్యాటకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందన్నారు. ప్రధాన రోజుల్లో పర్యాటకుల రద్దీ మరింత పెరుగుతుందన్నారు. పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆ దిశగా మనమంతా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), టీడీపీ నాయకులు గోపిచంద్, కుంచే దుర్గాప్రసాద్, ఇలియాస్ పాషా, వాలిశెట్టి తిరుమలరావు, వాలిశెట్టి వెంకటేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, జ్యుయలరీ పార్కు అసోసియేషన్ అధ్యక్షుడు పంచపర్వాల సత్యనారాయణ, పట్టణంలోని వివిధ వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

లైసెన్స్, ఫిట్‌నెస్ లేని పడవలన్నింటినీ సీజ్ చేయండి
* ఆర్డీవో ఉదయ భాస్కరరావు

మచిలీపట్నం, నవంబర్ 16: లైసెన్స్, ఫిట్‌నెస్ లేని బోట్లను, పడవలను తక్షణమే సీజ్ చేయాలని బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి వాటర్ లెవల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీవో ఉదయ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్, ఫారెస్టు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఫెర్రి వద్ద జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పడవ ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్, మండల స్థాయిలో వాటర్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీల్లోని సభ్యులంతా విధిగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న జల రవాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనుమతులు లేకుండా నడుపుతున్న పడవలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత బోట్లు, పడవలకు లైసెన్స్, ఫిట్‌నెస్ ఉందో లేదో చూడాలన్నారు. ఏ ఒక్కటి లేకపోయినా సీజ్ చేయాలని ఆదేశించారు. పడవ ప్రయాణాలపై ప్రజలతో పాటు పడవలు నడిపే వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రమాద నివారణ చర్యలు తీసుకునే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. పడవలో ప్రయాణించే ప్రతి ఐదుగురికి ఒక లైఫ్ బాయ్ (రక్షణ సాధనం)ఉండాలని, ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్లు ధరించి ఉండాలని ఆర్డీవో భాస్కరరావు సూచించారు.